నిర్వాహకులు నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Aug 19 , 2025 | 10:42 PM
వినాయక చవితి సందర్భంగా గణపతి మండపాల నిర్వహకులు నిబంధనలు పాటించా లని అగ్నిమాపక అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక స్నేహ ఇన్‌కన్వెన్షన్ హాలు లో నిర్వహించిన గణేష్ మంబపాల నిర్వహకుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : వినాయక చవితి సందర్భంగా గణపతి మండపాల నిర్వహకులు నిబంధనలు పాటించా లని అగ్నిమాపక అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక స్నేహ ఇన్‌కన్వెన్షన్ హాలు లో నిర్వహించిన గణేష్ మంబపాల నిర్వహకుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గణపతి మండపాల వద్ద ఎలాంటి పొరపాట్లు జ రగకుండా తగు జాగ్త్రతలు తీసుకోవాలన్నారు. ప్రతి మండపం వద్ద నీ రు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అనంతరం మండపాల నిర్వహకులు మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో గతుకుల రోడ్లు ఉండ డం, వర్షాల వల్ల రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున మున్సిపల్ అ ధికారులు పారిశుధ్య పనులను చేపట్టాలని, బ్లీచింగ్ పౌడర్, ఇతర సా మగ్రిని మండపాల వద్ద ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమిటి పట్టణాధ్యక్షుడు రాజ్‌కిరణ్, ప్రధాన కార్యదర్శి రవీందర్, కోశాధికారి కృష్ణ, ఉపాధ్యక్షుడు ప్రభాకర్, హరికృష్ణ, మండపాల నిర్వా హకులు పాల్గొన్నారు.