గ్రామాల్లో పాలనాధికారులు...
ABN , Publish Date - May 07 , 2025 | 10:57 PM
గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేప డుతోంది. ఇందులో భాగంగా గ్రామ పాలన అధికారి (జీపీవో) పేరిట కొత్త ఉద్యోగ నియామకాలను చేపట్ట బోతోంది. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో గ్రామ రెవె న్యూ అధికారి (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకు డు (వీఆర్‌ఎ) వ్యవస్థను రద్దు చేసి, అందులోని ఉద్యో గులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయగా, పై నిర్ణ యం కారణంగా గ్రామాల్లో భూ సమస్యలు, సంక్షేమ పథకాల గుర్తింపు, సర్వేలలో ఇబ్బందులు ఎదురవుతు న్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది.
-రెవెన్యూ పటిష్టానికి జీపీవో పేరుతో నియామకాలు
-పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల నుంచి దరఖాస్తుల స్వీకరణ
-ఈ నెల 10 లేదా 18న పరీక్ష నిర్వహణ
-అర్హత పొందిన వారికి వెంటనే నియామక పత్రాలు
-జిల్లా నుంచి 206 మంది దరఖాస్తు
మంచిర్యాల, మే 7 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేప డుతోంది. ఇందులో భాగంగా గ్రామ పాలన అధికారి (జీపీవో) పేరిట కొత్త ఉద్యోగ నియామకాలను చేపట్ట బోతోంది. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో గ్రామ రెవె న్యూ అధికారి (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకు డు (వీఆర్‌ఎ) వ్యవస్థను రద్దు చేసి, అందులోని ఉద్యో గులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయగా, పై నిర్ణ యం కారణంగా గ్రామాల్లో భూ సమస్యలు, సంక్షేమ పథకాల గుర్తింపు, సర్వేలలో ఇబ్బందులు ఎదురవుతు న్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. దీంతో జీ పీవో పోస్టుల ద్వారా రెవెన్యూ వ్యవస్థను తిరిగి బలో పేతం చేయడానికి శ్రీకారం చుట్టింది.
ఇతర శాఖల్లో సర్దుబాటు...
గతంలో వీఆర్వోలు, వీఆర్‌ఎలు గ్రామాల్లో ప్రభు త్వానికి, ప్రజలకు వారధిగా పనిచేశారు. భూములకు సంబంధించిన ప్రతి అంశం పట్ల వారికి పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. అయితే కొందరు అవినీతి సిబ్బంది వల్ల వీఆర్వో, వీఆరే వ్యవస్థలనే అప్పటి ప్రభుత్వం నిర్వీ ర్యం చేసింది. ఆయా విభాగంలో పని చేస్తున్న వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసింది. మం చి ర్యాల జిల్లాలోనూ వీఆర్వో, వీఆర్‌ఏల సర్దుబాటు జ రిగింది. 2022లో 167 మంది వీఆర్వోలను 37 శాఖల్లో సర్దుబాటు చేయగా, 2023లో 543 మంది వీఆర్‌ఏలను 11 శాఖల్లో సర్దుబాటు చేసింది. దీంతో గ్రామాల్లో భూ సర్వేలు, హక్కుల జారీ, విపత్తు సమాచార సేకరణ వంటి పనులు స్తంభించాయి. ఈ బాధ్యతలు వంచా యతీ కార్యదర్శులపై పడ్డాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో జిల్లాలోని 385 రెవెన్యూ గ్రామాలకు జీపీవోల నియామకం జరుగనుంది.
బదలాయింపుతో అన్యాయం....
2023 ఆగస్టులో జరిగిన వీఆర్‌ఏల బదలాయింపుల్లో వారి విద్యార్హతను బట్టి రెవెన్యూతో పాటు మున్సిపా లి టీ, నీటిపారుదల శాఖ కార్యాలయాల్లో జూనియర్ అసి స్టెంట్, రికార్డు ఆసిస్టెంట్, అటెండర్స్‌గా అవకాశం క ల్పించారు. మంచిర్యాల జిల్లాలో 542 మంది వీఆర్‌ఏ లు ఉండగా, ప్రస్తుతం రెవెన్యూ శాఖలో 260 మంది విధులు నిర్వహిస్తున్నారు. మిగతా వారిలో అధిక శా తం మందిని ఇతర శాఖల్లోకి పంపించారు. శాఖల బదలాయింపుల్లో భాగంగా వారంతా జీరో సర్వీసు నుంచి తిరిగి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాల్సి వచ్చిం ది. దీంతో ఇంతకాలం చేసిన కాలాన్ని కోల్పోవలసి వ చ్చింది. ఇదిలా ఉండగా రెవెన్యూశాఖలో అనేక సంవ త్సరాలు పని చేసినప్పటికీ వారందరూ ఆయా శాఖల్లో జీరో సర్వీసు నుంచి ఉద్యోగ ప్రస్థానం మొదలు పె ట్టారు. దీంతో పదిహేను, పదహారు ఏళ్ల నుంచి చేసిన సర్వీసు అంతా వృథా అయిపోయింది. కొద్ది రోజుల్లో వీఆర్వో నుంచి సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతులు పొందుతారన్న తరుణంలో గత ప్రభుత్వం వీఆర్వో, వీ ఆర్ వ్యవస్థను రద్దు చేయడంతో అర్హత ఉన్న వారంతా సర్వీసులను కోల్పోయి పదోన్నతులకు దూరమయ్యారు.
దరఖాస్తుల స్వీకరణ.....
జీపీవో నియామకాల కోసం పూర్వ వీఆర్వో, వీఆర్ ఏలలో డిగ్రీ అర్హతలున్నవారి నుంచి ప్రభుత్వం దరఖా స్తులు స్వీకరించింది. దీంతోపాటు ఇంటర్ పూర్తిచేసి, ఐదేళ్ల వీఆర్‌వో అనుభవం ఉన్న వారిని ఎంపిక చేస్తా రు. వీరికి స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. కాగా జీపీవో పోస్టులకు ఇతర శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 60 మంది వీఆర్‌వోలు, 160 మంది వీఆర్ ఏలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో స్ర్కూటినీ అనం తరం మొత్తం 206 మందిని పరీక్ష రాసేందుకు అర్హు లుగా గుర్తించారు. వీరి కోసం ఈ నెల 10న లేదా 18న స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహించనుండగా, అర్హత పొందిన వారికి ప్రభుత్వం జీపీవోలుగా నియామక పత్రాలు అం దజేయనున్నారు.