Adluri Lakshman Kumar: కేబినెట్‌ను దండుపాళ్యంగా అభివర్ణిస్తారా..?
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:14 AM
సిద్దిపేట కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య శనివారం సవాళ్ల పర్వం కొనసాగింది. పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరాలయానికి వచ్చిన మంత్రి అడ్లూరి...
హరీశ్‌రావు ఇలా మాట్లాడటం సరికాదు
అభివృద్ధిపై చర్చకు సిద్ధం: మంత్రి అడ్లూరి
సిద్దిపేట అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య శనివారం సవాళ్ల పర్వం కొనసాగింది. పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరాలయానికి వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. క్యాబినెట్ సమావేశంలో ఎలాంటి వ్యక్తిగత అంశాలు ప్రస్తావించనప్పటికీ, మంత్రివర్గాన్ని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి హరీశ్‌రావు దండుపాళ్యంగా అభివర్ణించడం బాధాకరమని, రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ 20 నెలల పాలనలో చేసిన అభివృద్ధి, పథకాల అమలుపై హైదరాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.