Share News

Adilabad Students Protest on Road: ప్రిన్సిపాల్‌ వద్దంటూ రోడ్డుపై పడుకొని విద్యార్థుల ధర్నా

ABN , Publish Date - Nov 26 , 2025 | 05:12 AM

సమస్యలపై ప్రశ్నిస్తే ప్రిన్సిపాల్‌ తిడుతున్నారని, వేధిస్తున్నారని ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మహాత్మా జ్యోతిబాఫూలె పాఠశాల విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు...

Adilabad Students Protest on Road: ప్రిన్సిపాల్‌ వద్దంటూ రోడ్డుపై పడుకొని విద్యార్థుల ధర్నా

  • ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ జ్యోతిబాఫూలె పాఠశాల విద్యార్థుల నిరసన

ఇచ్చోడ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): సమస్యలపై ప్రశ్నిస్తే ప్రిన్సిపాల్‌ తిడుతున్నారని, వేధిస్తున్నారని ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మహాత్మా జ్యోతిబాఫూలె పాఠశాల విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై అడ్డంగా పడుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌ నారాయణ తమను వేధిస్తున్నాడని రెండు రోజుల క్రితం వారు ‘ఈ ప్రిన్సిపాల్‌ మాకు వద్దు’ అంటూ లేఖ రాసి నారాయణకే అందించారు. దీంతో, ఆగ్రహానికి గురైన ప్రిన్సిపాల్‌.. నేను పాఠశాల నుంచి వెళ్లిపోవాల్సి వస్తే మిమ్మల్ని చంపి వెళ్లిపోతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కొందరు విద్యార్థులు మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రఽధాన రహదారిపై పడుకొని ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్‌ మారితే గాని పాఠశాలకు వెళ్లబోమన్నారు. పోలీసులు పిల్లలకు నచ్చజెప్పి పాఠశాలకు పంపించారు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్‌ నారాయణను వివరణ కోరగా.. విద్యార్థులు సీక్రెట్‌గా ఫోన్‌లు వాడుతున్నారని, ఆ ఫోన్‌లు తీసుకున్నందుకు విద్యార్థులు అలా చేశారని చెప్పారు.

Updated Date - Nov 26 , 2025 | 05:12 AM