మార్కెట్‌కు అదనపు ఆదాయం
ABN , Publish Date - May 08 , 2025 | 11:54 PM
చిట్యాల వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో మార్కెట్ ఆవరణలో భువనగిరిరోడ్డుకు నిర్మించిన 32 మడిగెలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి.
మార్కెట్‌కు అదనపు ఆదాయం
ప్రారంభానికి సిద్ధమైన మార్కెట్ మడిగెలు
అందుబాటులోకి రానున్న 32 షట్టర్లు
చిట్యాల, మే 8 (ఆంధ్రజ్యోతి): చిట్యాల వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో మార్కెట్ ఆవరణలో భువనగిరిరోడ్డుకు నిర్మించిన 32 మడిగెలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. సుమారు రూ.1.16 కోట్ల అంచనా వ్య యంతో నిర్మించిన మడిగెలు త్వరలోనే ప్రారంభానికి నోచుకోనున్నాయి. రెండు ఫ్లోర్లలో నిర్మించిన మడిగెలు రంగులు వేశారు. అన్ని పనులు పూర్తిచేశారు. కేవలం కరెంట్ మీటర్లు బిగించాల్సి ఉంది. కరెంటు మీటర్ల కోసం రూ.5.03లక్షలు మంజూరయ్యాయి. ఈ వారంలో మీటర్లు బిగించి మడిగెలను ప్రారంభించనున్నారు. మడిగెల ప్రారంభంతో భువనగిరిరోడ్డు కొత్తకళను సంతరించుకోనుంది. దుకాణాల అద్దె తక్కువగా ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు.
మడిగెల కేటాయింపులో రిజర్వేషన్లు
మార్కెట్ ఆధ్వర్యంలో నిర్మించిన మడిగెలు దుకాణదారులకు కేటాయింపులో రిజర్వేషన్లు పాటించనున్నట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల వారికి రిజర్వేషన్ల ఆధారంగా మడిగెలు కేటాయించనున్నారు. రిజర్వేషన్ల ఆధారంగా మడిగెలకు ఓపెన యాక్షన నిర్వహించి ఎక్కువ పాడిన వారికి కేటాయించనున్నట్లు సమాచారం. ఈ 32 మడిగెలు ప్రారంభిస్తే మార్కెట్ కమిటీ అదనపు ఆదాయం చేకూరనుంది.
మీటర్లు బిగించగానే ప్రారంభిస్తాం
మడిగెలకు విద్యుత్తు మీటర్లు బిగించగానే ప్రారంభిస్తాం. మడిగెలను రిజర్వేషన్ల ప్రకారం కేటా యిస్తాం. పనులు పూర్తయిన తర్వాత ఓపెనయాక్షన నిర్వహిం చి మడిగెలు కేటాయిస్తాం.
జానయ్య, మార్కెట్ కార్యదర్శి
త్వరగా ప్రారంభించాలి
మడిగెలను త్వరగా ప్రారంభించి అందుబాటులోకి తేవాలి. షాపు లేక తాత్కాలిక షెడ్డులో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామని మడిగెలు ప్రారంభిస్తే అందులోకి మారుతామన్నారు. దుకాణాల కిరాయి తక్కువగా ఉంచాలి.
ఏళ్ల రాములు, చిట్యాల