Share News

kumaram bheem asifabad- ఉపాధ్యాయులపై అదనపు కలెక్టర్‌ ఆగ్రహం

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:06 PM

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి ఆగ్రహం వ్యక్త చేశారు.మండలంలోని జిల్లా పరిషత్‌, ఆదర్శ పాఠశాల శుక్రవారం ఆయన తనిఖీ చేశారు

kumaram bheem asifabad- ఉపాధ్యాయులపై అదనపు కలెక్టర్‌ ఆగ్రహం
సిర్పూర్‌(యు) మోడల్‌ స్కూల్‌ విద్యార్థులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

సిర్పూర్‌(యు), ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి ఆగ్రహం వ్యక్త చేశారు.మండలంలోని జిల్లా పరిషత్‌, ఆదర్శ పాఠశాల శుక్రవారం ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌ పాఠశాలలో విద్యార్థులు హాజరు శాతం తక్కువగా ఉండడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు విద్యార్థులు ఇంత తక్కువ ఉన్నరన్నారు. ఉపాధ్యాయులు హాజరు పట్టిక చూశారు. ఒక ఒక నెలలోనే ఉపాధ్యాయులు 7 నుంచి 8 లీవ్‌లు తీసుకోవడం తదితర అంశాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల రికార్డులను పరిశీలించారు. అవి కూడాసక్రమంగా లేకపోవడంతో మండిపడ్డారు. ఇద్దరు ఉపాధ్యాయులకు మెమొలు ఇస్తామని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను తనిఖీ చేశారు. ల్యాబ్‌లను పరిశీలించారు.ఆదర్శ పాఠశాలలో ఇంకుడు గుంత నిర్మాణానికి భూమి పూజ చేశారు. తాగు నీటి సమస్యపై అదనపు కలెక్టర్‌కు వివరించారు. ఉపాధి హామీ పథకంలో బావి ఏర్పాటు చేయాలని ఎంపీడీవో కృష్ణారావును ఆదేశించారు. అంతకు ముందు పామువాడ గ్రామాన్ని సందర్శించారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 4 లక్షల నిధులతో మంజురు చేసిన కోళ్లఫారంను ప్రారంభించారు. చేలలోని వెళ్లడావనికి తమకు దారి లేదని అదనపు కలెక్టర్‌కు గ్రామస్థులు వివరించడంతో ఉపాధి హామీ పథకం ద్వార నిర్మించాలని ఎంపీడీవో కృష్ణారావును ఆదేశించారు. కార్యక్రమంలో జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడ్మేత విశ్వనాథ్‌రావు, ఎంపీడీవో కృష్ణారావు, ఎంఈవో కుడ్మేత సుధాకర్‌ ప్రిన్సీపాల్‌ వెంకట్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.

తిర్యాణి బ్లాక్‌ అభివృద్ధి సాధించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): సంపూర్ణత అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా తిర్యాణి బ్లాక్‌లో అధికారులు మరింత అభివృద్ధి సాధించాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో శుక్రవారం సంపూర్ణత అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా విద్య, వైద్య, ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ, ఇంజనీరింగ్‌, గిరిజన సంక్షేమ, వ్యవసాయ, మిషన్‌ భగీరథ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన ఆయన మాట్లాడుతూ తిర్యాణి బ్లాక్‌లో వివిధ శాఖలకు సంబంధించిన పురోగతిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. గిరిజనులకు హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌, క్యాన్సర్‌ వంటి వ్యాధులకు చికిత్సలు అందంచాలని, ప్రతి నెల గర్భిణులకు పరీక్షలు జరిపి సరైన పోషక ఆహారాన్ని అందించాలని సూచించారు. మహిళల శిశు సంక్షేమ శాఖాధికారులు గర్భిణులు, బాలింతలకు పోషక ఆహారం అందించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, చిన్న పిల్లలకు క్రమం తప్పకుండా ఎత్తు, బరువు పరిశీలించి శారీరక మానసిక లోపం ఉన్న పిల్లలను గుర్తించి అవసరమైన మందులు, పౌష్టిక ఆహారం అందించి సాధారణ స్థితికి తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, ఎంపీడీవో మల్లేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 11:06 PM