Share News

అదనపు కలెక్టర్‌ సేవలు స్ఫూర్తి దాయకం

ABN , Publish Date - Jun 01 , 2025 | 11:18 PM

జిల్లా అదనపు కలెక్టర్‌గా సబావత్‌ మోతిలాల్‌ సేవలు స్పూర్తిదాయకమని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పే ర్కొన్నారు. శనివారం రాత్రి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ పదవీ విరమణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

అదనపు కలెక్టర్‌ సేవలు స్ఫూర్తి దాయకం
జిల్లా అదనపు కలెక్టర్‌ దంపతులను సన్మా నిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాలకలెక్టరేట్‌, జూన్‌1(ఆంధ్రజ్యోతి): జిల్లా అదనపు కలెక్టర్‌గా సబావత్‌ మోతిలాల్‌ సేవలు స్పూర్తిదాయకమని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పే ర్కొన్నారు. శనివారం రాత్రి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ పదవీ విరమణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యో గులు, నాయకులు, పలు రంగాల ప్రజలు జిల్లా అదనపు కలెక్టర్‌ను ఘ నంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పనిసరి అని రెవెన్యూశాఖలో సుదీర్థకాలం 40 ఏళ్లుగా విధులు నిర్వహించి క్రమశిక్షణ ఉద్యోగిగా గుర్తింపు సాధించం సంతోషదాయకమన్నారు. వారి అనుభవాలు సేవలు భవిష్యత్‌తరాలకు ఎం తో స్పూర్తివంతంగా నిలుస్తాయన్నారు. వారి బావిజీవితం ఆయురారోగ్యా గలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆ యాశాఖల అధికారులు దుర్గప్రసాద్‌, కిషన్‌, వెంకటేశ్వర్లు, రాజవీరు, మీ సేవా నిర్వాహకులు నరేశ్‌, మండల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 11:18 PM