అదనపు తరగతి గదులు పూర్తి చేయాలి
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:30 PM
ఎంపీ నిధులతో ని ర్మిస్తున్న అదనపు తరగతి గదులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌కుమార్ సంబంధిత అధికారులను కోరారు.
- డీఈవో రమేష్ కుమార్
నాగర్‌కర్నూల్ టౌన్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : ఎంపీ నిధులతో ని ర్మిస్తున్న అదనపు తరగతి గదులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌కుమార్ సంబంధిత అధికారులను కోరారు. గురువారం నాగర్‌కర్నూల్ మునిసి పాలిటీ పరిధిలోని మండల పరి షత్తు ప్రాథమికోన్నత పాఠశాలను డీఈవో పరిశీలించారు. పాఠశాల ఆవరణలో నిర్మి స్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పను లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తరగతి గది నిర్మాణంలో నాణ్యతా ప్రమాణా లను పాటించాలని అధికారులను కోరారు. అనంతరం పాఠశాలలో ఏడో తరగతిని సంద ర్శించి విద్యార్థులతో మాట్లాడి పాఠ్యస్తకాలు, యూనిఫాం అందిన వివరాలను అడిగి తె లుసుకున్నారు. అభ్యాసన సామర్థ్యాలను పరి శీలించి మెరుగైన ఫలితాలకు తగు సూచనలు చేశారు. ఎంఈవో భాస్కర్‌రెడ్డి ఉన్నారు.