Share News

గంజాయికి బానిసలై.. ఇళ్లలో దొంగతనాలు

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:34 AM

గంజాయికి బానిసలై రాత్రి సమయాల్లో ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

గంజాయికి బానిసలై.. ఇళ్లలో దొంగతనాలు
కేసు వివరాలు వెల్లడిస్తున్న నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్రపవార్‌

గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన ముఠా ఫ నలుగురు అరెస్టు, పరారీలో మరో ఇద్దరు

రూ.20లక్షల సొత్తు స్వాధీనం

నల్లగొండ, జూలై 6(ఆంధ్రజ్యోతి): గంజాయికి బానిసలై రాత్రి సమయాల్లో ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిం దితుల్లో ఇద్దరు మైనర్లు, మరో నిందితుడితో పాటు వారికి సహకరిస్తున్న మహిళను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆది వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ కేసు వివరాలు వెల్లడించారు. తన ఇంట్లో దొంగతనం జరిగిందని జూన్‌ 30వ తేదీన నార్క ట్‌పల్లిలో రిటైర్డ్‌ ఐఎఫ్‌ఐఎస్‌ అధికారి గాలి యాదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. 22 తులాల బంగారు ఆభరణాలు, 80తులాల వెండి ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. నార్కట్‌పల్లి సీఐ, ఎస్‌ఐతో పాటు సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 5గంటల సమయంలో నార్కట్‌పల్లి గ్రామ శివారులో రెడ్డయ్య ఫ్యాక్టరీ పక్కన వెంచర్‌లో నలుగురు నార్కట్‌పల్లి చుట్టు పక్కల అవసరమున్న వారికి గంజాయి విక్రయించేందుకు వచ్చారని పోలీసులకు సమా చారం అందింది. పోలీసులు వెంచర్‌కు వెళ్లిన సమయంలో అనుమానాస్పదంగా కన్పి ంచిన ఇద్దరు మైనర్‌ నిందితులతో పాటు హైదరాబాద్‌ నాగోల్‌కు చెందిన బాజపల్లి జోసఫ్‌, అదే ప్రాంతానికి చెందిన మహిళ ఎరిక్‌ విల్‌సన్‌ మెరినాలను పట్టుకొని విచారి ంచారు. రెండు కిలోల గంజాయి కొనుగోలు చేసి దానిని నార్కట్‌పల్లి చుట్టుపక్కల అవసరమున్న వారికి విక్రయించేందుకు ప్రయత్నించారు. నిందితుల నుంచి రెండు కిలోల గంజాయి, బంగారు ఆభరణాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

గతంలో కేసులు నమోదైనా..

గతంలో వీరిపై జవహర్‌నగర్‌, నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోద య్యాయి. అరునా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. నిందితుల్లో ఒక మైనర్‌కు దగ్గరి బంధువులు నార్కట్‌పల్లి మండలంలో ఉండడంతో తనకు ఈ ప్రాంతమై అవగాహన ఉండడంతో నార్కట్‌పల్లి మండలంలో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. గంజాయి విక్రయించడంతో పాటు తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరికి ఎరిక్‌ విల్‌సన్‌ మెరీనా అనే మహిళ కూడా సహకరించింది. వీరు కత్తి, బల్లెం దగ్గర పెట్టుకొని దొంగతనాలు చేస్తూ అడ్డువస్తే చంపడానికి వెనుకాడరని ఎస్పీ తెలిపారు. హైదరాబాద్‌ నాగోలుకు చెందిన బోస్‌, ఒడిషా చెందిన మాలిక్‌ పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల నుంచి 17తులాల బంగారం, 70తులాల వెండి, 50వేల విలువైన రెండు కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం, మొత్తం రూ.20లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి పర్యవేక్షణలో, నార్కట్‌పల్లి సీఐ కె. నాగరాజు ఆధ్వర్యంలో ఎస్‌ఐ డి.క్రాంతికుమార్‌, ఏఎస్‌ఐ ఆంజనేయులు, హెడ్‌కానిస్టేబుల్‌ రాము, కానిస్టేబుల్‌ సత్యనారాయణ, హరిప్రసాద్‌, శివశంకర్‌, తిరుమల్‌, కృష్ణ, మహేష్‌ కేసును చేధించారు. సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Updated Date - Jul 07 , 2025 | 12:34 AM