Share News

Mandakrishna Madiga: లాకప్‌ డెత్‌లన్నీ పోలీసు హత్యలే

ABN , Publish Date - Dec 31 , 2025 | 05:15 AM

దేశంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్లన్నీ పోలీసుల హత్యలు కాకపోవచ్చు కానీ, లాకప్‌ డెత్‌లన్నీ పోలీసులు చేసే హత్యలే అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ...

Mandakrishna Madiga: లాకప్‌ డెత్‌లన్నీ పోలీసు హత్యలే

  • ఎన్‌కౌంటర్లన్నీ హత్యలు కాకపోవచ్చు: మందకృష్ణ

పంజాగుట్ట, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): దేశంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్లన్నీ పోలీసుల హత్యలు కాకపోవచ్చు కానీ, లాకప్‌ డెత్‌లన్నీ పోలీసులు చేసే హత్యలే అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. కోదాడలో కర్ల రాజేశ్‌ లాకప్‌ డెత్‌ కేసును హైకోర్టు సిటింగ్‌ న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జనవరి 10న కోదాడలో రాజేశ్‌ సంతాప సభ నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాజేశ్‌ లాకప్‌ డెత్‌ కేసులో ప్రధాన నిందితుడు ఎస్సై సురేశ్‌ రెడ్డిపై చర్యలు తీసుకోకుండా బీసీ వర్గానికి చెందిన సీఐ ప్రతాప లింగంను సస్పెండ్‌ చేయడం ఏ విధంగా సరైనదో డీజీపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 31 , 2025 | 05:15 AM