నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు
ABN , Publish Date - May 29 , 2025 | 11:35 PM
ఫర్టిలైజర్ షా పుల డీలర్లు నకిలీ విత్తనా లను విక్రయిస్తే చర్యలు తప్ప వని ఎస్‌ఐ మాధవరెడ్డి హె చ్చరించారు.
- ఎస్‌ఐ జి.మాధవరెడ్డి
కల్వకుర్తి, మే 29 (ఆంధ్రజ్యోతి) : ఫర్టిలైజర్ షా పుల డీలర్లు నకిలీ విత్తనా లను విక్రయిస్తే చర్యలు తప్ప వని ఎస్‌ఐ మాధవరెడ్డి హె చ్చరించారు. కల్వకుర్తి పట్ట ణంలోని పలు ఫర్టిలైజర్ షా పులను ఏవో సురేష్, టాస్క్ ఫోర్సు బృందం సభ్యులతో కలిసి ఆయన తనిఖీ చేశారు.
అనుమతి లేని విత్తనాలు అమ్మితే నేరం
తాడూరు : ప్రభుత్వ అనుమతి లేని పత్తి వి త్తనాలు ఎవరూ విక్రయించినా అలాంటి వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామ ని ఎస్‌ఐ గురుస్వామి హెచ్చరించారు. శనివా రం మండలంలోని గుంతకోడూరు గ్రామంలో విత్తనాల దుకాణాలను ఎస్‌ఐతో పాటు ఏవో సందీప్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. ప్రతీ రైతు తాము తీసుకునే పత్తి విత్తనాలకు సంబంధించి తప్పనిసరిగా ఆ షాపునకు సంబంధించి రసీదు పొందాలని సూచించారు.
జటప్రోలులో తనిఖీలు
పెంట్లవెల్లి : మండల పరిధిలోని జటప్రోలు గ్రామంలో గురువారం మండల వ్యవసాయ అఽధికారి వికాస్ తనిఖీలు చేశారు. స్టాక్ రిజి స్టర్, బిల్‌బుక్స్ పరిశీలించారు. జటప్రోలు విస్త రణ అధికారి విష్ణు, ఎస్‌ఐ రామన్‌గౌడ్ తదిత రులు పాల్గొన్నారు.
సీడ్స్ ఫర్టిలైజర్ షాపుల ఆకస్మిక తనిఖీ
పెద్దకొత్తపల్లి : మండల కేంద్రంలోని సీడ్స్ ఫర్టిలైజర్, పురుగు మందుల షాపుల్లో గురు వారం వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. షాపుల వద్ద స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. మండల వ్యవసాయ అధికారి శిరీష, ఎస్‌ఐ సతీష్ పాల్గొన్నారు.