ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:13 PM
అనుమతులు లేకుండా దుందుభీ వాగు నుంచి ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ అమరేందర్ హెచ్చ రించారు.
- అదనపు కలెక్టర్ అమరేందర్
ఉప్పునుంతల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : అనుమతులు లేకుండా దుందుభీ వాగు నుంచి ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ అమరేందర్ హెచ్చ రించారు. దాసర్లపల్లి గ్రామస్థుల ఫిర్యాదు మేరకు గురువారం తహసీల్దార్ సునీతతో కలిసి దుందుబీ వాగులో ఇసుక క్వారీలను ఆయన పరిశీలించారు. దుందుబీ వాగులో పెద్ద పెద్ద యంత్రాలతో ఇసుక తరలిస్తుంటే రెవెన్యూ అఽధికారులు ఏం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తర్వలోనే మన ఇసుక మన వాహనం పథకం ద్వారా ప్రభుత్వం ఇసుక సరఫరా చేస్తుందని ఆ యన తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు పా ల్పడితే వాహనాలు సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. నిత్యం తిరిగే వాహనాల వల్ల రోడ్లు గుంతలు పడ్డాయని గ్రామస్థులు అదన పు కలెక్టర్ దృషికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ లాలు ఉన్నారు.