kumaram bheem asifabad- విద్యారంగ అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:04 PM
విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని అదనపు కల్టెర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలను మంగళవారం సందర్శించి తరగతి గదులు, రిజిస్టర్లు, ప్రయోగశాల, వంట శాల, పారిశుధ్య నిర్వహణ అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం సకల సదుపాయాలు కల్పించి నిష్ణాతులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్య అందిస్తున్నందని తెలిపారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని అదనపు కల్టెర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలను మంగళవారం సందర్శించి తరగతి గదులు, రిజిస్టర్లు, ప్రయోగశాల, వంట శాల, పారిశుధ్య నిర్వహణ అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం సకల సదుపాయాలు కల్పించి నిష్ణాతులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్య అందిస్తున్నందని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, శుద్ధమైన తాగునీటిని అందించాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, వర్చువల్ రియాలిటీ పద్ధతిలో విద్యార్థులకు బోధించాలని తెలిపారు. పాఠశాలలో పారిశుధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని సూచించారు. వర్షాకాలం అయినందున వ్యాధులు వ్యాప్తిని నిరోధించే విధంగా వ్యక్తిత పరిశుభ్రతపై విద్యార్థులకు వివరించాలని తెలిపారు. పాఠశాలలో చేయాల్సిన మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం జన్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి రిజిస్టర్లు, విద్యార్థుల హాజరు, విద్యాబోధన, మధ్యాహ్న భోజనం అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలోని భవిత కేంద్రాన్ని సందర్శించి రికార్డుల పరిశీలన, విద్యార్థుల నమోదు వివరాలతో పాటు నూతనంగా నిర్మిస్తున్న భవిత కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రం ద్వారా విద్యాబోధన కొనసాగుతుందని అన్నారు. నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరిగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.
విద్యార్థుల హాజరుపై దృష్టి సారించాలి
ఆసిఫాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థుల హాజరుపై ఉపాధ్యాయులు, ఎంఈవోలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో విద్యార్థుల హాజరుపై మంగళవారం ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో పాఠశాలల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల హాజరుపై అధికారులు ప్రతి రోజు పర్యవేక్షించాలని అన్నారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే ఉపాధ్యాయులు విధుల పట్ల సమయ పాలన పాటించాలని, ఫేస్ రిజిస్ట్రేషన్ సిస్టం ప్రకారం నమోదు చేసుకోవాలని, చెప్పారు. సెలవుపై వెళ్లే ఉపాధ్యాయులు ముందుగా అనుమతి పొందాలని తెలిపారు. విద్యార్థులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మెనూ ప్రకారం సకాలంలో అందించాలని తెలిపారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.