యూరియా అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవు
ABN , Publish Date - Aug 19 , 2025 | 10:46 PM
యూరియా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండలంలోని రాపన్‌ప ల్లి వద్ద ఉన్న అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టును సందర్శించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు.
కోటపల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : యూరియా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండలంలోని రాపన్‌ప ల్లి వద్ద ఉన్న అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టును సందర్శించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ చెక్‌పోస్టులో పోలీసు సిబ్బందితో పాటు వ్యవసాయ, రెవెన్యూ శాఖల సిబ్బంది 24 గంటల పాటు నిరంతరం పకడ్బందీగా అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు చేస్తారన్నారు. ఈ చెక్‌పో స్టు వద్ద రెండు రోజుల క్రితం యూరియా అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో వ్య వసాయ, పోలీసు, ఇతర శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాల ను నియమించామని, జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టు ఏర్పాటు చేశామ న్నారు. ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడ యూరియాను అందుబాటులో ఉంచామని, డిస్ర్టిబ్యూషన్ సెంటర్‌ల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. యూరియా ఎరువులు దుర్వినియోగం కాకుండా కట్టుది ట్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. అనంతరం వాహన తనిఖీ సమయంలో వివరాలు నమోదు చేసిన రిజిష్టర్‌ను పరిశీలించడంతో పా టు వాహన తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వా హనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఎరువుల నియం త్రణ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంక టేశ్వర్లు, చెన్నూరు రూరల్ సీఐ బన్సీలల్, ఎస్‌ఐ రాజేందర్, ఇతర శాఖ ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.