Share News

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

ABN , Publish Date - Aug 01 , 2025 | 11:38 PM

ప్రభుత్వ అధికారు లు, ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని జైపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గంగిపెల్లి గ్రామంలోని పల్లె దవాఖానా, కుందారం గ్రామంలోని ప్రా థమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆ సుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, రిజిష్టర్‌లను, ప రిసరాలను పరిశీలించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
కుందారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

జైపూర్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ అధికారు లు, ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని జైపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గంగిపెల్లి గ్రామంలోని పల్లె దవాఖానా, కుందారం గ్రామంలోని ప్రా థమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆ సుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, రిజిష్టర్‌లను, ప రిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని, వై ద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్య లు తీసుకుంటామన్నారు. వర్షాకాలం అయినందున అంటు వ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు పాటించాల్సిన జాగ్రత్త లపై ప్రజలకు అవగాహన కలిపంచాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో సమయ పాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలందించా ల న్నారు. జైపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గంగిపెల్లి పల్లెద వాఖానాలో విధులకు గైర్హాజరైన వైద్యులకు, సిబ్బందికి షో కాజ్‌ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గంగిపెల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇళ్లు త్వరగా నిర్మించు కుంటే బిల్లులు మంజూరవుతాయన్నారు. అనంతరం మండ ల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయాన్ని సందర్శించి వంట శాల, మూత్రశాలలు, తరగతి గదులు, పరిసరాలను, అదన పు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థినీలకు పాఠాలు బోధించి ప్రశ్నలు అడిగి పఠన సా మర్ధ్యాలను తెలుసుకున్నారు. తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయాన్ని సందర్శించి ఉపాధ్యాయు లకు పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 01 , 2025 | 11:38 PM