మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:01 PM
మత విద్వేశాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య అలజడి సృష్టించే వాతావరణం కలగజేస్తున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు, ఉత్సవ సమితి సభ్యులు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చే శారు.
మంచిర్యాల క్రైం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : మత విద్వేశాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య అలజడి సృష్టించే వాతావరణం కలగజేస్తున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు, ఉత్సవ సమితి సభ్యులు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చే శారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చిట్ల సత్యనా రాయణ, తూముల నరేష్, పూదరి తిరుపతి మాట్లాడు తూ శనివారం వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేదికపై మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రజలను రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారని అన్నారు. హిందువుల మత విద్వేశాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుపై, కాంగ్రెస్ నాయకులపై అనుచిత వాఖ్య లు చేసిన మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.