బ్యాంకు మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:30 PM
మండల కేం ద్రంలోని యూనియన్ బ్యాంకు మేనేజర్ రమేష్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు రైతు లు, ఖాతాదారులు డిమాండ్ చేశారు.
- అసభ్య పదజాలంతో దూషిస్తున్న యూనియన్ బ్యాంకు మేనేజర్
- చారకొండలో బ్యాంకు ముందు రైతులు, ఖాతాదారుల నిరసన
చారకొండ, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : మండల కేం ద్రంలోని యూనియన్ బ్యాంకు మేనేజర్ రమేష్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు రైతు లు, ఖాతాదారులు డిమాండ్ చేశారు. బ్యాంకుకు వచ్చే ఖా తాదారుల, రైతులపై మేనేజర్ దురుసుగా ప్రవర్తిస్తు న్నారని, ఆయన తీరు మార్చుకో వాలని మంగళవారం బ్యాంకు ముందు పలువురు రైతులు, ఖాతాదా రులు నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లా డుతూ వివిధ పనుల మీద బ్యాంకుకు వచ్చే రైతులు, ఖాతాదారులు, మహిళలకు, వృద్ధులకు సరైన సేవలు అందించకుండా రోజుల తరబడి బ్యాంకు చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బంది పె డుతున్నారని పేర్కొన్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై సహనం కోల్పోయి దురుసుగా మాట్లా డుతున్నారని తెలిపారు. ఒక్కోసారి రెచ్చిపోయి కొందరిపైన ప్రత్యక్షదాడులకు సైతం పాల్పడు తూ, వారిని బ్యాంకు నుంచి గెంటేసే అంతటి పని చేస్తున్నారని ఖాతాదారులు అన్నారు. మేనేజర్ వైఖరి పట్ల ఈనెల 11న బ్యాంకు ముందు రైతులు, ఖదారులు ఆందోళన చేసినప్పటికీ మేనేజర్ తీరు మారక పోవడంతో బ్యాంకు మేనేజర్ రమేష్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.