kumaram bheem asifabad- భీమ్ సొసైటీపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Dec 24 , 2025 | 09:48 PM
వాంకిడి మండల కేంద్రంలోని సీహెచ్‌సీ ఆసుపత్రిలో పని చేస్తున్న శానిటేషన్, పేషెంట్‌కేర్, సెక్యూరిటీ గార్డ్స్‌తో పాటు ఇతర ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు చేల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న భౠమ్ సొసైటీపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు బుధవారం వైద్యాధికారి అయేషాకు వినతిపత్రం అందజేశారు.
వాంకిడి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): వాంకిడి మండల కేంద్రంలోని సీహెచ్‌సీ ఆసుపత్రిలో పని చేస్తున్న శానిటేషన్, పేషెంట్‌కేర్, సెక్యూరిటీ గార్డ్స్‌తో పాటు ఇతర ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు చేల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న భౠమ్ సొసైటీపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు బుధవారం వైద్యాధికారి అయేషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ వాంకిడి సీహెచ్‌సీలో పనిచేస్తున్న ఉద్యోగులు చాలిచాలని వేతనాలు తీసుకుంటు కుటుంబాన్ని ఫోషిస్తూ ఆసుపత్రిలో వచ్చే రోగులకు సేవలు అందిస్తున్నారని అన్నారు. ఐదు నెలల నుంచి భీమ్ సొసైటీ వారు వేతనాలు చెల్లించక పోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో జీవనం కొనసాగిస్తున్నారని ఆయన చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల వేతనాలతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించి వారికి గుర్తింపు కార్డులు అందించి జాతీయ సెలవులు మంజూరి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పిప్పిరి వెంకటేష్, తిరుపతి, ఆసుపత్రి సిబ్బంది దినకర్, చంద్రశేఖర్, జమున, గౌరుబాయి, భాత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.