Share News

Kalvakuntla Kavitha: ఎన్నికల కోడ్‌ఉల్లంఘిస్తున్న సీఎంపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:55 AM

సీఎం రేవంత్‌రెడ్డి పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ ధనంతో పట్టణ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారని....

Kalvakuntla Kavitha: ఎన్నికల కోడ్‌ఉల్లంఘిస్తున్న సీఎంపై చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ ధనంతో పట్టణ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుమిదినిని ఎస్‌ఈసీ కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, తాము చూపిన రుజువుల ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ సమావేశాలు ప్రజాధనంతో కాకుండా, సొంత నిధులతో నిర్వహించుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కొనసాగుతున్న సీఎం టూర్లను నిలిపివేయాలని, లేదా కఠినమైన ఆంక్షలు విధించాలని ఎస్‌ఈసీని కోరామని తెలిపారు.

Updated Date - Dec 04 , 2025 | 04:55 AM