Share News

Rape Cases: పరిచయస్తులే కీచకులు

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:31 AM

మహిళలపై అత్యాచారాలు, ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నవారిలో పరిచయస్తులు, తెలిసినవాళ్లే అధికంగా ఉంటున్నారు.

Rape Cases: పరిచయస్తులే కీచకులు

  • రాచకొండ కమిషనరేట్‌ పరిఽధిలో..ఈ ఏడాది 326 మందిపై అత్యాచారాలు

  • వార్షిక నేర నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మహిళలపై అత్యాచారాలు, ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నవారిలో పరిచయస్తులు, తెలిసినవాళ్లే అధికంగా ఉంటున్నారు. ఈ ఏడాది ఒక్క రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోనే 326 రేప్‌ కేసులు నమోదైనట్లు నేర వార్షిక నివేదికలో వెల్లడైంది. ఈ కేసుల్లో నిందితులు వందకు వంద శాతం బాధితులకు తెలిసినవారే కావడం గమనార్హం. 184 కేసుల్లో బాఽధితుల స్నేహితులే నిందితులని తేలింది. రాచకొండ కమిషనరేట్‌ పరిధికి సంబంధించిన వార్షిక నేర నివేదికను సోమవారం పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు వెల్లడించారు. ఈ ఏడాది సైబర్‌ నేరాలు 19.41 శాతం తగ్గాయని సీపీ తెలిపారు. 2024లో 4,168 సైబర్‌ క్రైం కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 3,734 కేసులు రిజిస్టర్‌ అయ్యాయనిచెప్పారు. కాగా, 2025లో 29,111 మంది సైబర్‌ నేరాల బాధితులకు లోక్‌ అదాలత్‌ల ద్వారా రూ.180 కోట్లు తిరిగి ఇప్పించినట్లు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖాగోయల్‌ తెలిపారు. సీఎ్‌సబీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 48,853 మంది బాధితులకు రూ.372 కోట్లు తిరిగి చెల్లించినట్లు చెప్పారు. సైబర్‌ నేరాల బారినపడినవారుగోల్డెన్‌ అవర్‌లో టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930కి సమాచారం అందించాలని సూచించారు.

Updated Date - Dec 23 , 2025 | 04:31 AM