పదిలో మంచి ఫలితాలు సాధించాలి
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:14 PM
ప్రతీ విద్యార్థి ఇష్టంతో చదివి పదిలో మంచి ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధి కారి రమేష్‌కుమార్ అన్నారు.
- డీఈవో రమేష్‌కుమార్
తిమ్మాజిపేట, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ విద్యార్థి ఇష్టంతో చదివి పదిలో మంచి ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధి కారి రమేష్‌కుమార్ అన్నారు. మండల కేంద్రం లోని జడ్పీహెచ్ పాఠశాలను బుధవారం ఆయ న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పదవ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో తెలు గు, గణితం, సామాన్యశాస్త్రం సబ్జెక్టులపై విద్యా ర్థులను ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. పది పరీక్షలకు సంబంధించి విద్యార్థులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థు లు మంచి ఫలితాలతో పాటుగా ర్యాంకులు సా ధించాలన్నారు. కష్టపడి చదవాలని, సమయా న్ని వృథా చేసుకోవద్దన్నారు. పాఠశాలలో నిర్వ హిస్తున్న ప్రత్యేక తరగతులను వినియోగించు కొని లక్ష్యం సాధించాలన్నారు. అంతకు ముందు ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఉ పాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యా ర్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. మండల విద్యా శాఖ అధికారి సత్యనారాయణశెట్టి తదితరులు ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్ బాధ్యతాయుతం
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అత్యంత బాధ్యత యుతమైన ప్రక్రియ అని డీఈవో రమేష్‌కు మార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కా ర్యాలయంలో బుధవారం పోస్టల్ బ్యాలెట్ ఓ టింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. గుడ్‌షెఫర్డ్ ప్రై వేట్ పాఠశాలలో ఈ నెల 13న ఎన్నికల సిబ్బం దికి సామగ్రి పంపిణీ చేసే కేంద్రంలోని ఏర్పా ట్లను ఎంపీడీవో లక్ష్మీదేవితో కలిసి పరిశీలించా రు. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రతీ ఉద్యోగి నిబంధనలు పాటించాలని సూచించారు. భద్ర త, తాగునీరు, విశ్రాంతి గదులు అదేవిధంగా అత్యవసర సమయంలో వైద్య సదుపాయాల వంటికి ఏర్పాటు చేయాలన్నారు.