Share News

kumaram bheem asifabad- మద్యం దుకాణాలకు ముగిసిన దరఖాస్తుల స్వీకరణ

ABN , Publish Date - Oct 23 , 2025 | 10:34 PM

ఆసిఫాబాద్‌ జిల్లాలో 2025-2027 నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగిసింది. జిల్లాలోని 32 మద్యం దుకాణాలు ఉనానయి. ఆసిఫాబాద్‌ డివిజన్‌ పరిధిలో 16, కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో 16 మద్యం దుకాణాలు ఉన్నాయి.

kumaram bheem asifabad-  మద్యం దుకాణాలకు ముగిసిన దరఖాస్తుల స్వీకరణ
దరఖాస్తులు స్వీకరిస్తున్న జిల్లా ఎక్సైజ్‌ అధికారి

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ జిల్లాలో 2025-2027 నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగిసింది. జిల్లాలోని 32 మద్యం దుకాణాలు ఉనానయి. ఆసిఫాబాద్‌ డివిజన్‌ పరిధిలో 16, కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో 16 మద్యం దుకాణాలు ఉన్నాయి. నూతన మద్యం పాలసీలో బాగంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 26 నుంచి మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరించారు. ప్రభుత్వం ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించింది. జిల్ల్లాలోని 32 దుకాణాలకు 622 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఆసిఫాబాద్‌ డివిజన్‌లోని 16 దుకాణాలకు 323, కాగజ్‌నగర్‌లోని 16 దుకాణాలకు 299 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్లకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని భావించింది. దరఖాస్తు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గురువారం వరకు గడువు పెట్టింది ఈ మేరకు జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు 653 దరఖాస్తులు వచ్చాయి. గడువు పెంచడంతో మరో 31 దరఖాస్తులు అదనంగా వచ్చాయి. దీంతో ఒక్కొ దుకాణానికి రూ. 3 లక్షల చొప్పున రూ. 19.59 కోట్లు ఆదాయం సమకూరింది. గతంలో జిల్లాలోని 32 దుకాణాలకు 1020 దరఖాస్తులు రాగ రూ. 20.40 కోట్లు ఆదాయం సమకూరింది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఈనెల 27న సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. డిసెంబరు 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది.

Updated Date - Oct 23 , 2025 | 10:34 PM