Telangana Health Department: యథావిధిగా ఆరోగ్య శ్రీ సేవలు
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:51 AM
రాష్ట్రంలో నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు యథావిఽధిగా కొనసాగుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అనుబంధ ఆస్పత్రుల్లో...
సేవలందిస్తోన్న 87ు ఆస్పత్రులు.. వైద్య ఆరోగ్యశాఖ
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు యథావిఽధిగా కొనసాగుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అనుబంధ ఆస్పత్రుల్లో 87 శాతం రోగులకు ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్నాయని తెలిపింది. కేవలం 13 శాతం ఆస్పత్రుల్లోనే సేవలు నిలిచిపోయినట్లు పేర్కొంది. ఆ 13 శాతం ఆస్పత్రులు కూడా వైద్య సేవలు తిరిగి కొనసాగించాలని ఆరోగ్యశ్రీ సీఇవో ఉదయ్ కుమార్ బుధవారం మరోమారు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద గత రెండు వారాలుగా సగటున రోజూ 844 శస్త్రచికిత్సలు నమోదవ్వగా, బుధవారం 799 శస్త్రచికిత్సలు నమోదు అయ్యాయని ఆయన వెల్లడించారు. రోగులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ దవాఖానాల్లో ఏర్పాట్లు చేసినట్లు వైద్యశాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ అనుసంధాన ఆస్పత్రులు 477 వరకు ఉండగా, అందులో కేవలం 62 సమ్మెలో ఉన్నాయని, మిగిలిన 415 ప్రైవేటు ఆస్పత్రులు యథావిధిగా సేవలందిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేశ్ మాత్రం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎ్‌స, జేహెచ్‌ఎ్‌స సేవలన్నిటిని నిలిపివేశామని తెలిపారు. తమ సమ్మె కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు.