ఆరోగ్యశ్రీ సేవలు అంతంతే...!
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:26 PM
ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అర్హులైన పేద, మద్యతరగతి ప్రజ లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అధునాతన ఉచిత సేవ లు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.
-ముందుకురాని కార్పొరేట్ ఆసుపత్రులు
జిల్లాలో కేవలం మూడింటికే అనుమతులు
పేద, మధ్యతరగతి వర్గాల వారికి తపని ఇక్కట్లు
మంచిర్యాల, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అర్హులైన పేద, మద్యతరగతి ప్రజ లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అధునాతన ఉచిత సేవ లు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇందు కో సం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య శ్రీ కార్డులు కూడా అందజేశారు. ఆ కార్డుల ద్వారా ఎంపిక ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స లు అందిస్తుండగా, బిల్లులకు సరిపడా నగదును ప్రభు త్వం ఆయా ఆసుపత్రుల నిర్వాహకులకు బ్యాంకుల్లో జమ చేస్తుంటుంది. జిల్లా విషయానికి వస్తే ఆరోగ్య శ్రీ సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో వివిధ ప్రాంతా ల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు కనీసం 50 వరకు ఉ న్నాయి. అయితే అందులో కేవలం మూడింటికి మాత్ర మే ఆరోగ్య శ్రీ అనుమతులు ఉండటం గమనార్హం. అనుమతులు వాటిలో కూడా అరకొరగానే ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నట్లు రోగులు చెబుతున్నారు.
ముందుకు రాని యాజమాన్యాలు...
జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల ప్రైవేటు ఆసుపత్రులు 200 పై చిలుకు ఉన్నాయి. వాటిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేవి పదుల సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆసు పత్రుల పేరిట పెద్ద సంఖ్యలో బోర్డులు దర్శనమిస్తా యి. అయినా ఆరోగ్య శ్రీ సేవలు అందించేందుకు వాటి నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ ల క్ష్యం నీరుగారి పోతుండగా....పేద, మధ్య తరగతి వ ర్గాలకు చెందిన ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచి త వైద్య సేవలు అందడం లేదు. దీంతో ఆయా వర్గాల ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయి స్తుండగా, ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉన్న కుటుంబా లు బిల్లులకు వెనుకాడకుండా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు వెళుతున్నారు. కనీసం 50 పడకలు ఉన్న ప్రతీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆరోగ్య శ్రీ పథకం అను మతులు పొందేందుకు అర్హత ఉంటుంది. అయితే ఆరోగ్య శ్రీ అనుమతులు పొంది లబ్ధిదారులకు చికిత్స అందిస్తే ప్రభుత్వపరంగా బిల్లులు ఎప్పుడు అందుతా యో తెలియని పరిస్థితులు ఉండటంతో నిర్వాహకులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పెండింగ్ బిల్లుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు యా జమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వం చొరవ తీసుకోవ డంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ, జిల్లా లో మాత్రం ఆ పరిస్థితి తలెత్తలేదు. జిల్లా వ్యాప్తంగా కేవలం మూడు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అం దుతుండటమే దీనికి కారణం.
జిల్లా వ్యాప్తంగా 2 లక్షల కార్డులు...
జిల్లాలో 2 లక్షల పై చిలుకు ఆరోగ్య శ్రీ కార్డులు ఉ న్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెల్ల రేషన్ కార్డు దారులందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు ఉన్నట్లే లెక్క. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 19 వేల 162 మందికి తెల్ల రేషన్ కార్డులు ఉండగా, వారందరికీ అనుమతులు పొందిన ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు పొందేందుకు అవకా శం ఉంది. జిల్లా కేంద్రంలోని మెడిలైఫ్, టచ్ మల్టీ స్పె షాలిటీ ఆసుపత్రులతోపాటు అభయ్ కిడ్నీ సెంటర్‌ల కు మాత్రమే ఇప్పటి వరకు ఆరోగ్య శ్రీ పథకం అను మతులు ఉండగా, లబ్దిదారులకు ఆ విభాగంలో వైద్య సేవలు అందుతున్నాయి. పై మూడు ఆసుపత్రుల్లో వా టి స్పెషాలిటీని బట్టి ప్రస్తుతం ఆర్థో, నెఫ్రాలజీ, యూ రాలజీ విభాగంలో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి.
వైద్య సేవలు విస్తృతం అయ్యేనా...?
వాస్తవంగా ఆరోగ్య శ్రీ పథకం కింద మొత్తం 1835 రకాల వ్యాధులకు చికిత్స అందాల్సి ఉంది. ఇందులో సాధారణ చికిత్స మొదలుకొని ఆపరేషన్ల వరకు సేవ లు అందుబాటులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ముందుకు వచ్చి, ఆరోగ్య శ్రీ పథకం అమలు చేస్తే, ఆ విభాగంలో వైద్య సేవలు మరింతగా విస్తృతం అయ్యే అవకాశాలు ఉ న్నాయి. ఆరోగ్య శ్రీ సేవల కోసం జిల్లా వాసులతోపాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన లబ్దిదారులు సైతం జిల్లా కేంద్రానికి వస్తుంటారు. కేవలం మూడు ఆసుపత్రుల్లో మాత్రమే సేవలు అందుబాటులో ఉండ టంతో అర్హతగల ప్రజలు కొంతమేర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు సహా, వైద్య ఆ రోగ్యశాఖ ప్రత్యేక చొరవతో మల్టీ స్పెషాలిటీ ఆసుప త్రుల నిర్వాహకులను ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందిం చేలా కృషి చేయగలిగితే రెండు జిల్లాల్లోనిలబ్ధిదా రులకు మరిన్ని ఉచిత వైద్య సేవలు అందే అవకాశం ఉంది.