ప్రజలను నిత్యం చైతన్య పరిచిన అక్షరయోధుడు
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:12 PM
తెలంగాణ ఉద్యమం లో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజల్లో నిత్య చైతన్యాన్ని రగిలింప జేసిన గొప్ప యోధుడు అందెశ్రీ అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మ డి జిల్లా అధ్యక్షుడు కాళ్ల నిరంజన్ కొని యాడారు.
- కవి అందెశ్రీకి ఘన నివాళి
నాగర్‌కర్నూల్ టౌన్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఉద్యమం లో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజల్లో నిత్య చైతన్యాన్ని రగిలింప జేసిన గొప్ప యోధుడు అందెశ్రీ అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మ డి జిల్లా అధ్యక్షుడు కాళ్ల నిరంజన్ కొని యాడారు. నిత్యం పేదలపక్షాన గొంతు క వినిపించే నిస్వార్థ మట్టి మనిషి అని అన్నారు. పట్టణంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన అందెశ్రీ చిత్రపటానికి నిరంజన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం మల్లేష్‌గౌడ్, జిల్లా కన్వీనర్ రవీందర్‌గౌడ్, బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా కన్వీనర్ అరవింద్‌చారి, నాయకులు నేష లక్ష్మ య్య, శ్రీనివాసులు, సుధాకర్‌గౌడ్, నిరంజన్ యాదవ్, తిరుపతయ్య, చైతన్య, మధు, లలిత, శివ, మౌలానా పాల్గొన్నారు.