పహల్గాం మృతులకు ఘన నివాళి
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:55 PM
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసి స్తూ కల్వకుర్తి పట్టణంలో శివాజీ సేవా సమితి ఆధ్వ ర్యంలో నిరసన వ్యక్తం చే శారు. అనంతరం కొవ్వొత్తు లతో ర్యాలీ నిర్వహించారు.
కల్వకుర్తి, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసి స్తూ కల్వకుర్తి పట్టణంలో శివాజీ సేవా సమితి ఆధ్వ ర్యంలో నిరసన వ్యక్తం చే శారు. అనంతరం కొవ్వొత్తు లతో ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదం నశించాలి భారత్ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని యావత్ ప్రపంచం మొత్తం ముక్తకంఠంతో ఖండిస్తుందని శివాజీ సేవా సమితి అధ్యక్షుడు పురం శేఖర్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో నా యకులు వివేకానంద, శ్రీధర్, నరేష్‌గౌడ్, కు డుముల శేఖర్‌రెడ్డి, మధు, శ్రీనివాసులు, అంజి, మహేశ్వర్‌రెడ్డి, సిద్దయ్యగౌడ్, రామకృష్ణ, మల్లే ష్, శ్రీనివాసులు, సంజయ్, నారాయణ, సాయి కుమార్ ఉన్నారు.
ఫ నాగర్‌కర్నూల్ టౌన్ : జమ్మూకశ్మీర్ పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటకులకు ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో ఫొటోగ్రాఫర్లు నివాళులు అ ర్పించారు. నాగర్‌కర్నూల్ అసెంబ్లీ ఫొటోగ్రా ఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండు కూడలి నుంచి అంబేడ్కర్ విగ్రహం వద్దకు కొవ్వొత్తులతో ర్యాలీగా వెళ్లి మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకం గా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు రమేష్‌చ గోవర్ధన్, నేతాజీగౌడ్, ప్రసాద్, శ్రీకాంత్, రాజు, శేఖర్, శ్రీను, నాగరాజు పాల్గొన్నారు.