kumaram bheem asifabad- భగత్‌సింగ్‌కు ఘన నివాళి
ABN , Publish Date - Sep 28 , 2025 | 10:58 PM
జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఆదివారం భగత్‌సింగ్ జయంతి సందర్భంగా ఆయా పార్టీలు సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో భగత్‌సింగ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆసిఫాబాద్ రూరల్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఆదివారం భగత్‌సింగ్ జయంతి సందర్భంగా ఆయా పార్టీలు సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో భగత్‌సింగ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భగంత్‌సింగ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లికార్జున్, పెంటన్న, ప్రసాద్, జయరాజ్, ప్రసాద్‌గౌడ్, సత్యనారాయణ, లింగమూర్తి, శంకర్, బిజ్జు, విలాస్, గట్టయ్య, మల్లేష్, యాదవ్ పాల్గొన్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో భగత్‌సింగ్ చిత్రపటానికి మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జైరాం, శ్యాంరావు, రాజేశ్వర్, ప్రతాప్, మహేష్, అమూల్, మనోజ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.