Share News

నిద్రిస్తున్న మహిళను బంధించి..

ABN , Publish Date - Jun 19 , 2025 | 12:18 AM

నిద్రిస్తున్న మహిళను బంధించి బంగారు ఆభరణాలు అపహరించిన సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని ఈటూరు గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది.

నిద్రిస్తున్న మహిళను బంధించి..

నాగారం,జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): నిద్రిస్తున్న మహిళను బంధించి బంగారు ఆభరణాలు అపహరించిన సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని ఈటూరు గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ ఎం. ఐలయ్య తెలిపిన వివరాల ప్రకారం... ఈటూరు గ్రామంలో నంగునురి బయ్యమ్మ మంగళవారం రాత్రి ఆరు బయట నిద్రిస్తుండగా రాత్రి ఒంటి గంట సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బయ్యమ్మ నోట్లో వస్త్రంతో కుక్కి, రెండు చేతులను మంచానికి కట్టేసి మెడలో ఉన్న తులం పావు బంగారు నల్లపూసల గొలుసు, ఇంటి తలుపులు పగులగొట్టి పెట్టెలో ఉన్న మూడు తులాల పుస్త్తెలతాడును, రూ.2,500 నగదు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jun 19 , 2025 | 12:18 AM