Share News

స్వయం సంఘాలకు ఒకే వేదిక

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:47 AM

మహిళల ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మహిళా సంఘాల ను బలోపేతం చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. ఎస్‌హెచ్‌జీ (సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌)కోసం సోలార్‌ ప్లాంట్లు, ఆర్టీసీలో బస్సులు, పెట్రోల్‌ బంకులు వంటివి నెలకొల్పేందుకు ప్రభుత్వం వారికి మద్దతిస్తోంది.

 స్వయం సంఘాలకు ఒకే వేదిక

గ్రామస్థాయిలో శాశ్వత భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు

గ్రామాల్లోని సంఘాల సభ్యులు ఒక వేదికపైకి

200 గజాల్లో రూ.10లక్షలతో భవనాల నిర్మాణం

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): మహిళల ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మహిళా సంఘాల ను బలోపేతం చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. ఎస్‌హెచ్‌జీ (సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌)కోసం సోలార్‌ ప్లాంట్లు, ఆర్టీసీలో బస్సులు, పెట్రోల్‌ బంకులు వంటివి నెలకొల్పేందుకు ప్రభుత్వం వారికి మద్దతిస్తోంది. రానున్న రోజు ల్లో మహిళల పేరుపైనే మరిన్ని రుణాలతోపాటు పలు సం క్షేమ పథకాలు అమలుచేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి.

గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలు(ఎ్‌సహెచ్‌జీ)లు తీసుకుంటున్న రుణాలు రికవరీ కూడా భేషుగ్గు ఉంది. దీంతో బ్యాంకులు విరివిరిగా స్వయం ఉపాధి యూనిట్లును మంజూరు చేస్తున్నాయి. గ్రామాల్లోని సం ఘాల సభ్యులు ఒక వేదికపైకి వచ్చి..., వారి అనుభవాలు, రుణాలు మంజూరు, తదితర అంశాలను చర్చించుకునేందుకు సరైన వేదిక లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం గ్రామాలు, మండలాల్లో వారికోసం ప్రత్యేకంగా శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించిం ది. ఇది మహిళా సాధికారతకు ఉపయోగపడుతుంది. వారి కార్యకలాపాలు నిర్వహించేందుకు స్వయం ఉపాధి పెంచుకునేందుక పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. గ్రామ, మండలస్థాయిల్లో ఒక స్థిరమైన వేదికను ఏర్పాటు చేయడం ద్వారా మహిళల్లో ఆత్మ విశ్వాసాన్నిపెంచేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తుంది. మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామపంచాయతీలస్థాయిలో కొత్త భవనాలు నిర్మించనున్నారు. ప్రతీ భవనానికి రూ.10లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈమేరకు భవన నిర్మాణాలకు సంబంధించిన నమూనాలను కూడా సంబంధిత శాఖలు సిద్ధంచేశాయి. జిల్లాలో మొత్తం 427 గ్రామపంచాయతీలున్నాయి. జిల్లాలో 14,842 స్వయం సహాయక సంఘాలు(ఎ్‌సహెచ్‌జీ)ఉండగా, 552 గ్రామసంఘాలున్నాయి. వీటిలో 1,55,256 మంది సభ్యు లున్నారు. జిల్లాలో 17మండల సమాఖ్యలు, ఒక జిల్లా సమాఖ్య ఉంది. గ్రామాల్లో శాశ్వత భవనాలు నిర్మించడం తో మహిళా సంఘాలకు కార్యకలాలు నిర్వహించేందుకు, స్వయం ఉపాధి, తదితర నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్రంగా ఉపయోగపడనున్నాయి.

ఉపాధి పథకం నిబంధనల ప్రకారం నిర్మాణాలు

గ్రామల్లో నిర్మిస్తున్న ఎస్‌హెచ్‌జీ భవనాలు పూర్తిగా మహాత్మగాంధీ ఉపాధి హమీ పథకం ని బంధనల ప్రకారం చేపట్టనున్నా రు. జిల్లాలో ఇంజినీరింగ్‌ శాఖల ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం భవనాలకు అంచనాలు రూపొందించనున్నారు. రూ.10లక్షల్లో మె టీరియల్‌ కాంపోనెంట్‌ డబ్బులు పోగా, మిగతా కూలీలతో పనులు చేయించనున్నారు. సాంకేతిక అనుమతులు, భూముల గుర్తింపు ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, ఎస్‌హెచ్‌జీ భవనాల నిర్మాణాలకు సంబంధించిన పూర్తి నివేదకను అందించనున్నారు.

200 గజాల్లో భవన నిర్మాణం

ప్రభుత్వం గ్రామపంచాయతీస్థాయిలో మహిళా సంఘాల(వీఓ)కు ప్రత్యేక భవనాలు 200 చదరపు గజాల్లో నిర్మించనున్నారు. ప్రతీ భవనానికి రూ.10లక్షల ఖర్చు చేయనున్నారు. మహిళా భవనాలు మొత్తం 552 చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. జిల్లాలో 562 గ్రామసంఘాలు ఉండగా జిల్లాలో సొంత భవనాలు 70మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం నూతనంగా భవనాలు మంజూరు చేయనుండటంతో జిల్లాలో దాదాపు 256 వరకు నూతనంగా భవనాలు నిర్మించనున్నారు. ప్రస్తుతం పలు గ్రామపంచాయతీల్లో భవన నిర్మాణాలకు స్థలాలు అనువుగా ఉన్నాయి. మిగతా గ్రామాల్లోనూ స్థలాలను పరిశీలించాలని ఈ మేరకు కలెక్టర్‌ సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కో భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాలను ఎంపికచేసి, గ్రామీణాభిృద్ధి శాఖకు పంపాలని ఆదేశించారు. ఎస్‌హెచ్‌జీ భవనాలు నిర్మించేందుకు మొదట గ్రామసంఘాలు తీర్మానాలు చేసి, మండల పరిషత్‌ అధికారులకు ప్రతిపాదనలు పంపాలి. ఎంపీడీవోలు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు పంపుతారు. కలెక్టర్‌స్థాయిలో కమిటీ భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తుంది.

256 గ్రామాల్లో భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు

-కె.నాగిరెడ్డి, డీఆర్డీవో

ప్రభుత్వం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ్‌స కింద స్వయం సహాయక సంఘాలకు గ్రామస్థాయిలో భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 562 గ్రామసంఘాలకు 70 గ్రామాల్లో శాశ్వత భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 256 గ్రామాల్లో భవనాలు నిర్మించేందుకు స్థలాలు అనువుగా ఉన్నాయి. వీటికోసం గ్రామ సంఘాలు తీర్మానం చేసి, ఎంపీడీవోలకు సమర్పించాలని, జిల్లాస్థాయిలో పరిశీలించి, ప్రభుత్వానికి నివేదించనున్నాం. ప్రభుత్వం ఒక్కో భవన నిర్మాణానికి గానూ రూ.10లక్షలు మంజూరు చేస్తుంది.

Updated Date - Dec 30 , 2025 | 12:53 AM