పకడ్బందీగా చిన్ననీటి వనరుల గణన చేపట్టాలి
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:13 PM
చిన్న నీటి వనరుల గణన పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారు లను ఆదేశించారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : చిన్న నీటి వనరుల గణన పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారు లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో కలె క్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి 7వ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీవో, డీఆర్‌డీవో, వ్యవసాయ, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ తదితర శా ఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లా డుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని చిన్న నీటి పారుదల గణన ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. 2వేల హెక్టా ర్లలోపు విస్తీర్ణం ఉన్న జలవనరుల గణన మొబైల్ అప్లికేషన్ ద్వారా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఆఫీసర్‌గా తహసీల్దార్, ఎంపీఎస్‌వో, నీటిపారుదల శాఖ ఏఈలు సూపర్‌వైజర్లుగా ఉంటారని జీపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏఈవోలు ఎన్యుమరేటర్లుగా కొనసాగుతారని వివరించారు. నీటిపారుదల శాఖ, ఇతర శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన వివ రాలను గణనలో పాల్గొనే అధికారులకు అందజే యాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాత, డీఆర్‌డీఏ పీడీ చిన్న ఓబు లేష్, పీఆర్ ఈఈ విజయ్‌కుమార్, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి మురళి పాల్గొన్నారు.