ప్రజల కోసం పని చేసే పార్టీ
ABN , Publish Date - Jun 08 , 2025 | 11:22 PM
ప్రభుత్వ పద వుల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ పని చేయదని ప్రజల పక్షాన పోరాటాలు చేసి ప్రజా సంక్షేమ కోసం పాటు పడు తుందని ఆ పార్టీ జిల్లా కార్యద ర్శి బాలనర్సింహ అన్నారు.
- మండల మహాసభలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం బాలనర్సింహ
పెంట్లవెల్లి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పద వుల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ పని చేయదని ప్రజల పక్షాన పోరాటాలు చేసి ప్రజా సంక్షేమ కోసం పాటు పడు తుందని ఆ పార్టీ జిల్లా కార్యద ర్శి బాలనర్సింహ అన్నారు. ఆది వారం మండల కేంద్రంలో న్యా యవాది చిన్న కురుమయ్య అ ధ్య క్షతన సీపీఐ మొదటి మహా సభలు నిర్వహించగా బాలనర్సింహ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బత్తిని రాము, జిల్లా కార్యదర్శి చిన్న కురుమయ్య, కొల్లాపూర్ మండల కార్యద ర్శి తుమ్మల శివుడు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కిరణ్ కుమార్, ప్రజానాట్యమండలి రాష్ట్ర నా యకులు గోపాల్, మండల కన్వీనర్ దేవసహా యం, నిరంజన్ నాయుడు, సురేష్, ఏఐటీయూ సీ నాయకులు సువర్ణ, రాజు, నరసింహ, శేఖర్, మండలంలోని ప్రజలు పాల్గొన్నారు.
ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి
పెద్దకొత్తపల్లి : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నాయకులు, కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ మండల కార్యదర్శి బొల్లె ద్దుల శ్రీనివాసులు పార్టీ శ్రేణులకు పిలుపుని చ్చారు. ఆదివారం మండలంలోని దేదినేనిపల్లి గ్రామంలో సీపీఐ మహాసభ నిర్వహించారు. క ల్మూరి పెద్ద బాలస్వామి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సీపీఐ పెద్దకొత్త పల్లి మండల 18వ మహాసభను వెన్న చెర్ల గ్రామంలో ఈ నెల 15న నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనం తరం నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శిగా చిట్టాల రాధాకృష్ణ, సహాయ కార్యదర్శులుగా తిప్పరాజు, శివప్ర సాద్, చిన్న బాలస్వామి, కోశాధికారిగా సుల్తాన్, సలహాదా రుగా చుక్క మద్దిలేటితో పాటు మరో ఐదుగు రు సభ్యులు కమిటీని ఎన్నుకున్నారు.