Share News

kumaram bheem asifabad- ప్రారంభమైన పనుల జాతర

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:04 PM

రాష్ట్ర ప్రభుత్వంలోని గ్రామ పంచా యతీలలో రూ. 2,149 కోట్లతో నిర్వహిస్తున్న పనుల జాతర జిల్లాలో ప్రారంభమైంది. ఆసిఫాబాద్‌ మండలం అంకుశాపూర్‌ గ్రామంలో జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి గ్రామ పంచాయతీ భవనానికి, రూప్‌ వాటర్‌ హార్వస్టింగ్‌ సిస్టం( ఇంకుడు గుంత)కు భూమి పూజ చేశారు.

kumaram bheem asifabad- ప్రారంభమైన పనుల జాతర
గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వంలోని గ్రామ పంచా యతీలలో రూ. 2,149 కోట్లతో నిర్వహిస్తున్న పనుల జాతర జిల్లాలో ప్రారంభమైంది. ఆసిఫాబాద్‌ మండలం అంకుశాపూర్‌ గ్రామంలో జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి గ్రామ పంచాయతీ భవనానికి, రూప్‌ వాటర్‌ హార్వస్టింగ్‌ సిస్టం( ఇంకుడు గుంత)కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జిల్లాలోని ఉపాధి హామీ కూలీలకు వంద రోజుల పని కల్పించే లక్ష్యంతో పనుల జాతర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా జిల్లాలోని 15 మండలాల్లోని 335 గ్రామ పంచాయతీల్లో 951 వివిధ రకాల అభివృద్ధి పనులను చేయనున్నట్లు వివరించారు. అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలో వంద రోజుల పని చేసిన ఉపాధి హామీ కూలీలను సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతి, డీఎల్‌పీవో ఉమర్‌హుస్సేన్‌, తహసీల్దార్‌ రియాజ్‌ అలీ, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో మౌనిక, టీఏ మల్లుబాయి, కార్యదర్శి కవిత తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో వంద రోజులుపని పూర్తి చేసిన ఉపాధి హామీ కూలీలు స్వరూప, బండారి నందాబాయిని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి సన్మానించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణ, జామ్నిలో ఇంకుడు గుంతలు, పశువుల కొట్టాన్ని అదనపు కలెక్టర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటి చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావు, సహకార చైర్మన్‌ కొడప హన్ను పటేల్‌, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఎంపీవో మోహన్‌, ఎపీవో నగేష్‌, ఈసీ అంకుష్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్‌ ముకీద్‌ తదితరులు పాల్గొన్నారు.

తిర్యాణి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): తిర్యాణి మండలంలో పనుల జాతరలో భాగంగా నిర్మించిన పౌలీ్ట్ర షెడ్‌ శుక్రవారం ప్రారంభించారు. ఇంకుడు గుంతలను ప్రారంభించారు. అనంతరం వంద రోజుల పని పూర్తి చేసిన కూలీలు, దివ్యాంగ కూలీలు, పారిశుధ్య కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లేష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, ఏపీఓ షాకీర్‌ ఉస్మాని, ఈసీ రజిత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి (ఆంధ్రజ్యోతి): వాంకిడి మండలంలోని సరండి గ్రామంలో శుక్రవారం ఎంపీడీవో ప్రవీణ్‌ పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అదే గ్రామ పంచాయతీలో సేంద్రీయ ఎరువుల తయారి కేంద్రంకు భూమి పూజ చేశారు. అనంతరం గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీవో శ్రావణ్‌కుమార్‌, ఈసీ మోసిన్‌, టీఏ నరేష్‌, ఎఫ్‌ఏ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో పనుల జాతర కార్యక్రమాన్ని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని గోల్కొండ గ్రామానికి చెందిన విమలకు పశువుల పాక ప్రభుత్వం ద్వారా రూ.9200 ఉపాధి హామీ నిధులతో మంజూరు చేయగా పనులను ప్రారంభించారు. పోతెపల్లి, కాటేపల్లి గ్రామాల్లో పశువుల పాకలను ప్రారంభించినట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమం ఏపీఓ రాజన్న, ఈసీ రజినీకాంత్‌, కార్యదర్శి వైకుంఠం, టీఏ రవీందర్‌, నాయకులు సుగుణ, ఎఫ్‌ఏ రవికుమార్‌, నాయకులు హకీం, సురేష్‌, శ్రీనివాస్‌, షణ్ముఖ, విష్ణుమూర్తి, శైలేష్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): డబ్బా, బాలాజీఅనుకోడ, బాబాసాగర్‌, తదితర గ్రామాల్లో శుక్రవారం పనుల జాతర కార్యక్రమాన్ని ఎంపీడీవో సుధాకర్‌ఎరడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డబ్బాలో నిర్మించిన 1000 పక్షుల పౌలీ్ట్ర ఫార్మ్‌, బాలాజీ అనుకోడలో నిర్మించిన పశువుల పాక, బాబాసాగర్‌లో ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శులు, గ్రామస్తులు, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమాన్ని శుక్రవారం ఎంపీడీవో అంజద్‌పాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర 130 పనులను సుమారు రూ.2 కోట్ల అంచనాతో గుర్తించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ కూలీలను సన్మానించారు. కార్యక్రమంలో డీటీ సంతోష్‌కుమార్‌, నాయకులు కలాం, మునీర్‌, లక్ష్మణ్‌, దృపతాబాయి, మోతిరాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 11:04 PM