కొండారెడ్డిపల్లిలో కొత్త పాలక వర్గానికి ఘన సన్మానం
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:09 PM
మండలంలోని సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి సర్పంచు స్థానం ఏకగ్రీవమైంది.
వంగూరు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి సర్పంచు స్థానం ఏకగ్రీవమైంది. గురువారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాల యంలో సర్పంచ్ మల్లెపాకుల వెంకటయ్యకు, 10 మంది వార్డు సభ్యులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జంగయ్య నియామక పత్రాలు అంద జేశారు. ఉప సర్పంచ్‌గా వేమారెడ్డిని ఎన్నుకు న్నట్లు రిటర్నింగ్ అధికారి జంగయ్య తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ సంక్షేమ రైతు కమిషన్ సభ్యు డు కేవీఎన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ ఎనుముల కృష్ణారెడ్డి వారిని ఘనంగా సన్మానించారు. మన గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకోవడం అభినందనీ యని అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటయ్య, ఉప సర్పంచ్ వేమారెడ్డి, వార్డు సభ్యుడు ముత్యాల లక్ష్మారెడ్డిలు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో పులిజాల కృష్ణారెడ్డి, లాలుయాదవ్, వెంకట్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.