Share News

kumaram bheem asifabad- కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:24 PM

జిల్లా వ్యాప్తంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆసిఫాబాద్‌ పట్టణంలోని పద్మశాలి సంఘ భవనంలో ఆ సంఘం నాయకులు కొండా లక్ష్మణ్‌బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

kumaram bheem asifabad- కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి
ఆసిఫాబాద్‌లో నివాళులు అర్పిస్తున్న పద్మశాలి సంఘం సభ్యులు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆసిఫాబాద్‌ పట్టణంలోని పద్మశాలి సంఘ భవనంలో ఆ సంఘం నాయకులు కొండా లక్ష్మణ్‌బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, శ్రీకాంత్‌, ఎ.శ్రీకాంత్‌, లింగయ్య, మంగ, పుష్పలత, సునీత, క్రాంతి, రేవతి, లావణ్య, శైలేందర్‌, సురేష్‌, శ్రీనివాస్‌, మోహన్‌, ధర్మయ్య, మధుకర్‌, తిరుపతి, మోహన్‌, లక్ష్మినారాయణ, రమేష్‌, రవీందర్‌, తిరుపతి, వెంకటేష్‌ పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ వర్ధతి సందర్భంగా ఆయన చిత్రపటానికి లక్ష్మణ్‌ సేవా సదన్‌ చైర్మన్‌ అవినాష్‌, కార్యదర్శి మడావి దౌలత్‌లు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు సతీష్‌, రాకేష్‌, మొండయ్య, సాయి, నారాయణ, గణేష్‌, అనీల్‌, దాదాజీ, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌,(ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పద్మశాలి భవన్‌లో ఆదివారం ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆదివారం పద్మశాలి భవన కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిందం చంద్రయ్య, గుళ్లపల్లి ఆనంద్‌, రాపెల్లి సదానందం, గుళ్లపల్లి నాగేశ్వర్‌ రావు, గడదాసు మల్లయ్య, దోమల సురవర్ధన్‌, అవదూత శ్రీనివాస్‌, వెంకన్న, శంకర్‌, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన (ఆంధ్రజ్యోతి): రెబ్బెనలో గోలేటి పద్మశాలి వెల్ఫేర్‌ సోసైటీ ఆధ్వర్యంలో ఆచార్య కొంఛ్ఛి లక్ష్మణ్‌ బాపూజి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఎనలేని సేవలు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో గోలేటి పద్మశాలి వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు గుండేటి వీర స్వామి, ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కోశాధికారి మారిన చందర్‌, మండల పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కైలాసం, శ్రీపతి, బోగ రవీందర్‌, శ్రీనివాస్‌, సాయి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఆదివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు తిరుపతి, వెంకటేష్‌, ఎస్‌.వెంకటేశం, గణేష్‌, జనార్ధన్‌, శంకర్‌, శ్రీకాంత్‌, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2025 | 11:24 PM