Share News

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:37 PM

రాష్ట్రంలో ప్రజల సం క్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుం దని రాష్ట్రకార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలి పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెన్నూరు నియోజకవర్గంలో రైతులు తీ వ్రంగా నష్ట పోతున్నారని, చేతికందిన పంటలు పూర్తిగా పాడైపోతున్నా యన్నారు.

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి వివేక్‌వెంకటస్వామి

-సన్నబియ్యం పథకానికి రూ. 12 వేల కోట్లు

-కాళ్వేరం ప్రాజెక్టుతో రైతులకు నష్టం

మందమర్రిటౌన్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ప్రజల సం క్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుం దని రాష్ట్రకార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలి పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెన్నూరు నియోజకవర్గంలో రైతులు తీ వ్రంగా నష్ట పోతున్నారని, చేతికందిన పంటలు పూర్తిగా పాడైపోతున్నా యన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో ప దేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు, రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనకు తేడా చూడాలన్నా రు. ప్రజల్లో ఆదరణ కోల్పోయిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాటకాలు ఆడుతోం దన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని, వారు కేసీఆర్‌ వద్దకు వెళ్లి నిలదీయాలన్నారు. మా జీ సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిపోయిం దన్నారు. ప్రాజెక్టు నీటితో సంబంధం లేకుండా 80 శాతం పంటలు పం డుతున్నాయన్నారు. గతంలో తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని తన తండ్రి అప్పటి సీఎం రాజశేఖర్‌ రెడ్డికి చెప్పారని, అక్కడ ప్రాజెక్టు కడితే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనన్నారు. బీసీ రిజర్వేషన్‌లకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకం కోసం రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. సన్నబియ్యం ప థకంతో ప్రజలందరు సంతోషంగా ఉన్నారన్నారు. కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదేనని తెలిపారు. కేసీఆర్‌ కూతురు కవి తే కుంభకోణాల చిట్టా విప్పుతుందని, ఇది ప్రజలు గమనిస్తున్నారన్నా రు. బీఆర్‌ఎస్‌ పార్టీ దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు చేసిం దేమి లేదన్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 11:37 PM