Share News

వైభవంగా గిరిప్రదక్షణ

ABN , Publish Date - Aug 09 , 2025 | 11:25 PM

రాఖీ పర్వదినాన్ని పురష్కరించుకుని లక్షెట్టిపేట పట్టణంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర నరసింహ స్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి పురష్కరించు కుని ఆలయం గుట్ట చుట్టూ భుక్తులు, కమిటీ సభ్యులు వేదపండితుల స మక్షంలో గిరి ప్రదక్షణలు చేసారు.

 వైభవంగా గిరిప్రదక్షణ

లక్షెట్టిపేట, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): రాఖీ పర్వదినాన్ని పురష్కరించుకుని లక్షెట్టిపేట పట్టణంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర నరసింహ స్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి పురష్కరించు కుని ఆలయం గుట్ట చుట్టూ భుక్తులు, కమిటీ సభ్యులు వేదపండితుల స మక్షంలో గిరి ప్రదక్షణలు చేసారు. గిరి ప్రదక్షణల అనంతరం ఆలయ పు రోహితులు కొత్తపల్లి బరద్వాజ్‌ శర్మ, రాజేంద్ర శర్మల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్‌ భక్త బృదంతో పాటు సత్యసాయి సేవా సమితి సభ్యులు భజనా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ కమిటి ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలయానికి వచ్చిన భ క్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని సదుపాయాలు కల్పించారు. ఈకా ర్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 11:25 PM