kumaram bheem asifabad- నెరవేరిన కల
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:16 PM
కాగజ్‌నగర్‌లో వందేభారత్ హాల్టు ప్రకటనతో పట్టణంలో ఆదివారం సంబరాలు నిర్వహించారు. నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు కేవలం నాగ్‌పూర్, కాజీపేట, సికింద్రాబాద్ హాల్టు మాత్రమే ఉండేది. ఈ రైలుకు కాగజ్‌నగర్, మంచిర్యాల, రామగుండం హాల్టులను ఇస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగజ్‌నగర్‌కు ఉదయం 8 గంటలకు బయలుదేరనుంది.
- కాగజ్‌నగర్ వాసులకు మెరుగుపడనున్న రవాణా సౌకర్యం
కాగజ్‌నగర్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లో వందేభారత్ హాల్టు ప్రకటనతో పట్టణంలో ఆదివారం సంబరాలు నిర్వహించారు. నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు కేవలం నాగ్‌పూర్, కాజీపేట, సికింద్రాబాద్ హాల్టు మాత్రమే ఉండేది. ఈ రైలుకు కాగజ్‌నగర్, మంచిర్యాల, రామగుండం హాల్టులను ఇస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగజ్‌నగర్‌కు ఉదయం 8 గంటలకు బయలుదేరనుంది. సికిందాబ్రాద్‌కు 12 గంటల వరకు చేరనుంది. కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాలంటే ఉదయం భాగ్యనగర్, ఇతర విక్లీ రైళ్లు మాత్రమే ఉంటున్నాయి. ఇవీ కూడా 8 గంటలు దాటితే ఒక్కటికి కూడా ఉండదు. మళ్లీ 11 గంటల నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో అత్యవసరమున్న సికింద్రాబాద్‌కు వెళ్లాలంటే కార్లను బుక్ చేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రైల్వేశాఖ ప్రకటించిన తర్వాత ఇప్పుడు అందరికి సమస్య తీరనుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్‌కు కూడా మధ్యాహ్నం 1 గంట లకు బయలు దేరితే కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు 5 గంటలకు వచ్చేట్టు సమయాన్ని నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా నేరుగా కాగజ్‌నగర్‌కు వచ్చేందుకు ఎలాంటి రైళ్లు లేవు. కేవలం భాగ్యనగర్ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిత్యం మధ్యాహ్నం 3 గంటల వరకు, దక్షిణ్, ఇతర ఎక్ర్‌ప్రెస్‌లు కూడా రాత్రి 9 తర్వాతే ఉన్నాయి. తిరుగు ప్రయాణం సమస్య కూడా తీరనుందని చెబుతున్నారు. కాగా ఈ రైలు ఎప్పటి నుంచి హాల్టింగ్ ఇస్తారన్నది ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాగా ఈ రైలు కోసం గతేడాది నుంచి సిర్పూరు ఎమ్మెల్యే హరీష్‌బాబు తీవ్రతమైన కృషి చేశారు. రైల్వే మంత్రితో పాటు రైల్వే జీఎంకు కూడా వినతి పత్రాలను అందజేసి సమస్యను వివరించారు. ఈ మేరకు ఆయన కృషి ఫలించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.