kumaram bheem asifabad- ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి రాజ్యాంగం అవసరం
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:25 PM
ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి రాజ్యాంగం అవసరమని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకని బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి అదనపు కలెక్టర డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఆసిఫాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి రాజ్యాంగం అవసరమని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకని బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి అదనపు కలెక్టర డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ భారత దేశ పౌరులు తమ హక్కులతో ప్రశాంతంగా జీవించడానికి భారత రాజ్యాంగం మార్గదర్శకమని అన్నారు. భారత రాజ్యాంగ విలువలు, ప్రాథమిక హక్కులు, పౌర హక్కులు, కర్తవ్యాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి రాజ్యాంగం ఎంతో ఆవశ్యమని తెలిపారు. ప్రకపంచంలోనే అతి పెద్ద ప్రజా స్వామ్య వయవస్థ కలిగిన మన దేశంలో వ్యవస్థను నిర్వహించడం మన దేశ రాజ్యాంగం అత్యంత కీలకమైందని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ, దేశాభివృద్దికి కట్టుబడి పని చేయాలన్నారు. రాజ్యాంగ స్పూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రజా సేవలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లాలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మున్సిపాల్టీలో బుధవారం రాజ్యంగ అవతరణ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ పూల మాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యంగ కర్త అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో మేనేజర్ మల్లయ్య, మెప్మా స్టాప్ నారాయణ, శంకర్, రఫీక్, ఉసా, ఎస్‌హెచ్‌జీ సభ్యుల, మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యతి): మండలంలోని కొండిబాగూడ, జైనూర్ తదితర గ్రామాల్లో బుధవారం 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావ్, సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఇంతీయాజ్ లాల, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్‌అబ్దుల్ ముకీద్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కాంబ్లే బాబా సాహేబ్, నాయకులు కాంబ్లే నాగోరావ్, మవాలె దతాత్రి, కోటంబే శ్రీహరి గరుడ్‌కర్ కేశవ్, కాంబ్లే అన్నారావ్, గాయక్ వాడ్ సతీష్, బి. వెంకటి తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వద్ద రాజ్యాంగ దినోత్సవం సంతర్భంగా ఏర్పాటు చేసిన మాలల ఆత్మీయ సమ్మేళనంలో జాతీయ అఽధ్యక్షుడు రామ్మోహన్ మాట్లాడారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు యశోద, వరంగల్ మహిళా అఽధ్యక్షురాలు త్రివేణి, చైర్మన్ అధ్యక్షురాలు నరసింహా, జాతీయ కార్యదర్శి యాదగిరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధవిహార్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు అశోక్, సందీప్, దుర్గాజీ, విజయ, రోషన్, శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు.