డీఎంహెచ్‌వోపై సమగ్ర విచారణ జరపాలి
ABN , Publish Date - May 18 , 2025 | 12:21 AM
డీఎంహెచ్‌వోపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలని తెలంగాణ యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
భానుపురి, మే 17(ఆంధ్రజ్యోతి): డీఎంహెచ్‌వోపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలని తెలంగాణ యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లో పబ్లిక్ హెల్త్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లుకు ఎన్‌ఎంసీ చట్టం, పీసీపీఎన్‌డీటీ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయన్నారు. యాపిల్ స్కానింగ్ సెంటర్‌కు రెన్యూవల్ చేయడంపై కొన్ని ఆధారాలు అందించినట్లు తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, గిరిజన శక్తి రాష్ట్ర నాయకులు ధరావత్ వెంకటేష్‌నాయక్, టీఆర్‌వీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు బంటు సందీప్, వడ్లేపల్లి సందీప్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు నాగయ్య, అశోక్ తదితరులు ఉన్నారు.