Share News

వాగుపై బ్రిడ్జి నిర్మించాలి

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:39 PM

మండలంలోని నర్సాపూర్‌లోని వాగుపై బ్రిడ్జి నిర్మించాలని సీపీఎం మండల కార్యదర్శి దాగం రాజారం డిమాండ్‌చేశారు. శుక్రవారం బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ వాగు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.

వాగుపై బ్రిడ్జి నిర్మించాలి

వాగు వద్ద నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు

తాండూర్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని నర్సాపూర్‌లోని వాగుపై బ్రిడ్జి నిర్మించాలని సీపీఎం మండల కార్యదర్శి దాగం రాజారం డిమాండ్‌చేశారు. శుక్రవారం బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ వాగు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్‌ పరిధిలోని సోయం లచ్చుపటేల్‌ గూడెంకు దారిలో ఉన్న తాత్కాలికంగా వాగుపై ఏర్పాటు చేసిన వంతెన కూలిపోయిందన్నారు. ప్రతి వర్షాకాలం లో వాగు దాటలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంకె రవి, రాజేశం, రాజ య్య, బాఉరావు, బాదిరావు, గంగారాం, పార్వతి రావు, వెంకటేష్‌,చిన్ను, మారుతి, జంగు, ఈశ్వరి, విజయలక్ష్మీ, జంగుబాయి పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 11:39 PM