Share News

kumaram bheem asifabad- వ్యాపారులకే వరం..సామాన్యులకేదీ ఫలం

ABN , Publish Date - Oct 21 , 2025 | 10:39 PM

వంట సామగ్రి నుంచి ఎలక్ర్టానిక్‌ వస్తువుల వరకు జీఎస్టీ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మధ్య తరగతి తో పాటు అన్ని వర్గాల్లో సంతోషాన్ని నింపింది. వివిధ శ్లాబుల్లో మార్పులు చేయడంతో ధరల తగ్గిం పుపై చిరుద్యోగులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. సంస్కరణలతో చాలా వస్తువులు సున్నా పరిధిలోకి రావడం లేదా ఐదు శాతానికి త గ్గించడం వినియోగ దారుడికి ప్రయోజనకరంగా మారింది.

kumaram bheem asifabad- వ్యాపారులకే వరం..సామాన్యులకేదీ ఫలం
లోగో

- కుమరం భీం జిల్లాలో జీఎస్టీ అమలు తీరు

- పట్టించుకోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు

వాంకిడి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): వంట సామగ్రి నుంచి ఎలక్ర్టానిక్‌ వస్తువుల వరకు జీఎస్టీ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మధ్య తరగతి తో పాటు అన్ని వర్గాల్లో సంతోషాన్ని నింపింది. వివిధ శ్లాబుల్లో మార్పులు చేయడంతో ధరల తగ్గిం పుపై చిరుద్యోగులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. సంస్కరణలతో చాలా వస్తువులు సున్నా పరిధిలోకి రావడం లేదా ఐదు శాతానికి త గ్గించడం వినియోగ దారుడికి ప్రయోజనకరంగా మారింది. సెప్టెంబరు 22 నుంచి నూతన పన్నుల విధానం అమల్లోకి వచ్చినప్పటికి జిల్లాలో వాహనాల ధరలు మినహా ఎలకా్ట్రనిక్‌, నిత్యావసర సరకులను వ్యాపారులు పాత ధరలతోనే విక్రయిస్తున్నారు. ఇప్పుడు విక్రయిస్తున్నవి పాత నిల్వలని వీటికి పాత శ్లాబులే వ ర్తిస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త ఉత్పత్తులు వచ్చాక ధరలు తగ్గుతా యంటూ పలు చోట్ల వ్యాపారులు జీఎస్టీ విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు.

- బిల్లులు ఇవ్వని వ్యాపారులు..

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా పలువురు వ్యాపారులు జీఎస్టీ వసూలు చేస్తున్నా బిల్లులు ఇవ్వడం లేదు. స్టేషనరి సామగ్రిపై కేంద్రం వన్నును పూర్తిగా ఎత్తివేసిం ది. జిల్లాలోని పలు దుకాణాల్లో పాత ధరల ప్రకారమే రాత పుస్తకాలు, ఇతర సామాగ్రి విక్రయిస్తున్నారు. రైతులు ఉపయోగించే వ్యవసాయ పరికరాలు, వస్తువులపై 12, 18 శాతం ఉన్న జీఎస్టీని ప్రస్తుతం ఐదు శాతానికి ప్రభుత్వం తగ్గించింది. కొత్త జీఎస్టీ విధా నంతో స్టీల్‌, సిమెంట్‌, ధరలపై 28 శాతంగా ఉన్న పన్నును 18 శాతానికి కేంద్రం తగ్గించింది. జిల్లాలో పాత ధరలకే స్టీల్‌, సిమెంట్‌ విక్రయిస్తున్నారు. కే ంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా జిల్లాలో పాత ధరలకే వస్తువులను అమ్ముతూ... సొమ్ముచే సుకుంటున్నారు. కొందరు వ్యాపారులు రూ. లక్షల పన్ను ఎగవేస్తు అక్రమార్జనకు పాల్పడు తున్నారు. కాగా జీఎస్టీ 2.0 అమలు తీరుపై వాణిజ్య పన్నుల శాఖ పర్యవేక్షణ పెరిగితే వినియో గదారులకు మేలు జరుగుతుంది. వ్యాపారాలు సాగించే వారి విషయంలో అధికారులు కఠినంగా వ్యవహారించాలి. జీఎస్టీ తగ్గింపుతో నెలకు జిల్లాలో వినియోగదారు లకు రూ. లక్షల్లో ప్రయోజనం కలుగనుంది.

ఫ నిరుపేదలు నష్టపోతున్నారు..

- అజయ్‌కుమార్‌, మాజీ జడ్పీటీసీ

కేంద్ర ప్రభుత్వం గత నెల 22 నుంచి జీఎస్టీ తగ్గించినపటికి వ్యాపారులు పాత ధరలకే వస్తు వులను విక్రయించడంతో నిరుపేదలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రతి దుకాణంలో వస్తువులు కొనుగోలు చేసేందుకు పోతే పాత ధరలకు అమ్ము తున్నారు. మాకు ఇంకా కొత్త సరుకులు రాలేదని అందుకే పాత ధరలకు విక్రయిస్తున్నామని చెబుతు న్నారు. జిల్లాలో వ్యాపారులు నూతన పన్నుల అమలు చేయాలి. వాణిజ్య పన్నుల శాఖ అధికారు లు పర్యవేక్షించి పాత ధరలకు విక్రయించే వ్యాపా రులపై చర్యలు తీసుకోవాలి.

Updated Date - Oct 21 , 2025 | 10:39 PM