రైతు సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:30 PM
రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే సంకల్పంతో రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే సంకల్పంతో రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కొనుగోళ్లు జరగాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కల్వకుర్తి మం డల పరిధిలోని మార్చాల, పంజుగుల, ముకు రాల గ్రామాల్లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యేప్రారంభించారు. ముకురాల గ్రామంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొను గోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్ర యించి మద్దతు ధర రూ.2320తో పాటు సన్నరకానికి మరో రూ. 500బోనస్ పొందాలని కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ను సైతం ఏర్పాటు చేయాలని అఽ దికారులను ఆదేశించారు. పొద్దుతి రుగుడు గింజల కొనుగోలు కేంద్రాలు రాష్ట్రం లోనే మూడు ఉన్నాయని, అందులో తలకొండ పల్లి పడకల్ గ్రామంలో ఏర్పాటు చేసినట్లు తెలి పారు. కార్యక్ర మంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకు లు కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కు మార్, మాజీ జడ్పీటీసీ అశోక్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలాసంజుకుమార్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రమాకాంత్‌రెడ్డి, మాజీ సర్పంచ్ జిల్లెల రాము లు, నాయకులు విజయ్‌కుమార్‌రెడ్డి, మల్లెపల్లి జగన్, శ్రీకాంత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, వెంకటేశ్, సురేష్, రైతులు, నాయకులు ఉన్నారు.