Pharmacy Admissions: ఫార్మసీలో 97 శాతం సీట్లు భర్తీ
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:25 AM
ఫార్మసీ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించిన ఎప్‌సెట్ తుది విడత కౌన్సెలింగ్ ముగిసింది. ఎంపికైన వారి జాబితాను ఎప్‌సెట్ కన్వీనర్...
హైదరాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఫార్మసీ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించిన ఎప్‌సెట్ తుది విడత కౌన్సెలింగ్ ముగిసింది. ఎంపికైన వారి జాబితాను ఎప్‌సెట్ కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మంగళవారం విడుదల చేశారు. మొత్తం 10,960 సీట్లలో 10,595 (97ు) భర్తీ కాగా 365 మిగిలాయి. మొత్తం 71,309 మంది కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. 16,336 మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరవగా, 15,192 మంది ఆప్షన్లు ఎన్నుకున్నారు. బి-ఫార్మసీలో 8,175 సీట్లు భర్తీ కాగా 348 మిగిలాయి. అలాగే ఫామ్-డిలో 1,671 సీట్లు భర్తీ కాగా 11, ఫార్మాస్యుటికల్ ఇంజనీరింగ్‌లో 116 భర్తీ కాగా 6 మిగిలాయి. బయో మెడికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీలో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఎంపికైనవారు ఈ నెల 22లోపు ఫీజు చెల్లించాలని, 23లోపు కాలేజీలో టీసీ, ఇతర ధ్రువీకరణపత్రాలు సమర్పించాలని శ్రీదేవసేన తెలిపారు.