Hyderabad ORR Bus Accident: ఔటర్‌పై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:02 AM
ఓఆర్‌ఆర్‌పై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ఇనుప రేలింగ్‌ను ఢీకొట్టి.. 20 అడుగుల లోతులో బోల్తా కొట్టిం ది. అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని...
9 మందికి గాయాలు.. పెద్ద అంబర్‌పేట్ వద్ద ఘటన
అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఓఆర్‌ఆర్‌పై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ఇనుప రేలింగ్‌ను ఢీకొట్టి.. 20 అడుగుల లోతులో బోల్తా కొట్టిం ది. అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్ ఔట ర్ రింగురోడ్డులో శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో బస్సులో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక చెకింగ్ ఇన్‌స్పెక్టర్ ఉన్నారు. అందరికీ గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 40సీట్ల సామర్థ్యం గల న్యూగో ఎలక్ట్రిక్ ట్రావెల్స్ బస్సు శనివారం ఉదయం మియాపూర్ నుంచి ఏపీలోని గుంటూరుకు బయలుదేరింది. మియాపూర్‌లో గుంటూరుకు చెందిన మౌనిక, కేపీహెచ్‌బీవద్ద షేక్ జహీర్, బంగిడాల ప్రత్యూష, కార్తీక్, మూసాపేట వై జంక్షన్ వద్ద అంబటి ప్రభాకర్, ఆకుల గాయత్రి బసెక్కారు. ఆరుగురు ప్రయాణికులతో ఉదయం 11 గంటలకు బస్సు మియాపూర్ నుంచి గచ్చిబౌలి ఔటర్ రింగురోడ్డు మీదుగా గుంటూరుకు బయలుదేరింది. శనివారం మధ్యాహ్నం పెద్ద అంబర్‌పేట్ ఓఆర్‌ఆర్ ప్రధాన రోడ్డు నుంచి టోల్‌ప్లాజా వద్దకు వస్తుండగా బస్సుకు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో పాటు డ్రైవర్ వీరాంజనేయ రెడ్డి, అదనపు డ్రైవర్ శ్రీనివాస్, చెకింగ్ ఇన్‌స్పెక్టర్ గోపీకృష్ణకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. బస్ పర్మిట్ వ్యాలిడిటీ 2028 వరకు ఉన్నప్పటికీ, ఆథరైజేషన్ వ్యాలిడిటీ, ఫిట్‌నెస్, పొల్యుషన్ వ్యాలిడిటీ 5వ నెల 2025కే ముగిసింది. ఇన్సూరెన్స్ కూడా 2024లోనే అయిపోయినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.