72 Storey Skyscraper: ఘటకేసర్‌లో 72 అంతస్తుల భవనం?
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:38 AM
హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్ ప్రాంతంలో 72 అంతస్తుల భారీ భవనాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ...
దక్షిణాసియాలోనే ఎత్తయిన నిర్మాణం
ఫైర్ సెక్యూరిటీ సదస్సులో డీజీ
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్ ప్రాంతంలో 72 అంతస్తుల భారీ భవనాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఓ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రాజెక్టు అనుమతుల కోసం అగ్నిమాపక శాఖను సంప్రదించిందని ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. హైటెక్‌సిటీలోని ఓ హోటల్‌లో ‘ఫైర్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ జాతీయ సదస్సును ఆయన శుక్రవారం ప్రారంభించారు. భవిష్యత్తులో నగరంలో చేపట్టబోయే భారీ ప్రాజెక్టుల గురించి చర్చిస్తున్న సందర్భంలో ఆయన ఈ భవనం గురించి ప్రస్తావించారు. ఈ నిర్మాణం పూర్తయితే దక్షిణాసియాలో ఇదే ఎత ్తయిన భవనంగా రికార్డు సాధిస్తుందన్నారు. నిర్మాణ దారులు ఈ భవనంలో ప్రతి 30 అంతస్తులకు నిర్మాణాన్ని మార్చుతూ.. డాన్సింగ్ డెఫోడైల్ ఽఽథీమ్‌తో దీనిని రూపొందిస్తున్నారని తెలిపారు. దీనిని దూరం నుంచి చూసినపుడు భవనం స్థిరంగా కాకుండా, గాలిలో మెలికలు తిరుగుతున్నట్టుగా భ్రమను కలిగిస్తుంది. ఈ భారీ భవనంలో అగ్నిప్రమాదాల నివారణకు సంబంధించిన పటిష్ఠమైన చర్యలను ప్లాన్‌లో పొందుపరిచినట్లు తెలుస్తోంది.