Maoists Surrender: ఒకేరోజు 72మంది మావోయిస్టుల లొంగుబాటు
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:15 AM
ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం ఒక్కరోజే బస్తర్ డివిజన్‌లోని కాంకేర్, బీజాపూర్ జిల్లాల్లో 72మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు....
ఛత్తీస్‌గఢ్ కాంకేర్‌లో 21మంది, బీజాపూర్‌లో 51మంది..
చర్ల, కొత్తగూడెం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌లో బుధవారం ఒక్కరోజే బస్తర్ డివిజన్‌లోని కాంకేర్, బీజాపూర్ జిల్లాల్లో 72మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. కాంకేర్ జిల్లాలోని అడవుల నుంచి మూడు రోజుల క్రితం 21మంది మావోయిస్టులు, 18తుపాకులతో లొంగిపోగా బుధవారం వీరిని కాంకేర్ జిల్లా పోలీసులు అధికారికంగా మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ పాల్గొన్నారు. మరోవైపు బీజాపూర్ జిల్లా పోలీసుల ఎదుట బుధవారం 51మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో పీఎల్‌జీఏ 1, 2, 5 బెటాలియన్, జనతన సర్కార్ సభ్యులున్నారని బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ తెలిపారు. కాగా, ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.9.50లక్షల చెక్కులను ఎస్పీ రోహిత్ రాజు అందజేశారు.