Share News

Health Department: వైద్యశాఖలో పదోన్నతులు

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:16 AM

ప్రజారోగ్య సంచాలకుల పరిఽధిలో 36 మంది వైద్యులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. డిప్యూటీ సివిల్‌ సర్జన్‌/సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ హోదాలో ఉన్న వీరికి..

Health Department: వైద్యశాఖలో పదోన్నతులు

  • 36 మంది సివిల్‌ సర్జన్లకు పోస్టింగ్‌లు

  • డీఎంహెచ్‌వోలుగా ఏడుగురి నియామకం

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య సంచాలకుల పరిఽధిలో 36 మంది వైద్యులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. డిప్యూటీ సివిల్‌ సర్జన్‌/సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ హోదాలో ఉన్న వీరికి.. సివిల్‌ సర్జన్లుగా ప్రమోషన్‌ ఇచ్చింది. వీరికి పోస్టింగులు ఇస్తూ వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందినవారిలో ఏడుగురిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు (డీఎంహెచ్‌వోలు)గా, ఐదుగురిని జాయింట్‌ డైరెక్లర్లుగా నియమించారు. మిగిలిన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంవో (రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌)లుగా పోస్టింగ్‌ ఇచ్చారు. డీఎంహెచ్‌వోలుగా నియమితులైన వారిలో ముదిలి వసంతరావు, కె.లలితాదేవి, బి.మల్లీశ్వరి, డి.రామారావు, డి.స్వర్ణకుమారి, రాథోడ్‌ తుకారాం, పి.వెంకటరమణ ఉన్నారు. జేడీలుగా బి.విజయనిర్మల, సి.హెచ్‌. అరుణ్‌కుమార్‌, కె.ఎ్‌స.పద్మశ్రీ, వెంకటరమణ స్వామి, ప్రభు దయాకిరణ్‌ నియమితులయ్యారు. ఇదిలా ఉండగా.. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ ేసవల విభాగంలో ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్ల (అడ్మినిరేస్టషన్‌)కు జేడీ(అడ్మినిరేస్టషన్‌)లుగా పదోన్నతి లభించింది. వీరిలో ఎన్‌.కృష్ణవేణి, శ్వేతా ముంగా, బి.మంజునాథ్‌ నాయక్‌ ఉన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 04:16 AM