61మంది అభ్యర్థులు సర్పంచ్‌గా గెలిచి తీరుతారు
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:29 PM
సర్పంచ్ ఎన్నికల్లో లక్షెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మూడు మండలాల నుంచిప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న 61మంది అభ్యర్థులు సర్పంచ్‌గా గెలిచి తీరుతారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. శనివారం లక్షెట్టిపేట పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు
లక్షెట్టిపేట, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): సర్పంచ్ ఎన్నికల్లో లక్షెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మూడు మండలాల నుంచిప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న 61మంది అభ్యర్థులు సర్పంచ్‌గా గెలిచి తీరుతారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. శనివారం లక్షెట్టిపేట పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలకు తెలుపుతూ ప్రచారం నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని బీఆర్‌ఎస్, బీజేపీలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని అవి ప్రజలు నమ్మరన్నారు. గ్యారంటీల అమ లు విషయంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ముందుకు వస్తే తానొక్కడినే సమాధానం చెబుతానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రాని నిధులు మన మంచిర్యాలకు తెచ్చానన్న విషయం ఆరెండు పార్టీలకు తప్ప ప్రతీ ఒక్కరికీ తెలుసన్నారు. కేసీ ఆర్‌లాగా తొడ కోసుకుంటే మెడ కోసుకుంటా అనే ఎమ్మెల్యేను కాదని రైతుల కోసం ని యోజకవర్గ ప్రజల కోసం పని చేసే ఎమ్మెల్యేను అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వద్దన్న కూ డా ఎన్నికల సమయం నాఅభ్యర్థుల కోసం వాళ్ల గెలుపు కోసం ఆరోగ్యం ఎలాగున్నా రాక తప్పదని మొండి కేసి వచ్చానన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ఎంత చెప్పిన వినక పోవ డంతో వాళ్లు ఏర్పాటు చేసిన హెలిక్యాప్టర్‌లో వచ్చానని వాళ్లకు ధన్యవాదాలు తెలిపారు. తన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకున్న వారికందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నానని కంటతడి పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జిల్లా మహిళ నాయకురాలు కొక్కిరాల సురేఖ, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్‌చంద్, వైస్ చైర్మన్ ఆరీఫ్, ఆర్జీపిఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, పార్టీ మండలాధ్యక్షుడు పింగిళి రమేష్, జిల్లా ఉ పాధ్యక్షుడు చింత అశోక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, డీసీసీ అధికార ప్రతినిధి పూర్ణచందర్‌రావు, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు పాల్గొన్నారు.
లక్షెట్టిపేటలో బైక్‌ర్యాలీ..
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు రెండు నెలల తర్వాత లక్షెట్టిపేటకు రావడంతో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి,ఆరీఫ్ ఆధ్వర్యంలో సుమారు 100 బైక్‌లతో ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. ర్యాలీలో పలువురు నాయకులు కార్యకర్త లు యువకులు పాల్గొని ఎమ్మెల్యే పీఎస్సార్ జిందాబాద్, జిల్ల టైగర్ పీఎస్సార్ అంటూ నినాదాలు చేస్తు ర్యాలీ చేపట్టారు.
ఎమ్మెల్యే కాన్వాయిలో ఢీకొన్న కార్లు
మంచిర్యాల నుంచి లక్షెట్టిపేటకు వస్తున్న ఎమ్మెల్యే కాన్వాయిలో కార్లు ఢీకొన్నాయి. సు మారు 50కార్లు ఒకదాని వెనుకాల మరొకటి రావడంతో లక్షెట్టిపేట మండలం శాంతా పూర్ జాతీయ రహదారిపై కాన్వాయిలోని ఒక వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో ఒక్క సారిగా ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో రెండు కార్లు దెబ్బతిన్నాయి. ఎవరికి ఏలాం టి గాయాలు కాలేదు.