Old Stone Age Artifacts: మంచిరేవులలో 6 వేల ఏళ్ల నాటి ఆనవాళ్లు
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:33 AM
హైదరాబాద్‌లోని మంచిరేవులలో ప్రాచీన రాతియుగం నాటి ఆదిమానవుని ఆనవాళ్లు బయటపడ్డాయి..
పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని మంచిరేవులలో ప్రాచీన రాతియుగం నాటి ఆదిమానవుని ఆనవాళ్లు బయటపడ్డాయి. పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో జరిపిన అన్వేషణలో ఈ ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ ఆనవాళ్లు సుమారు 6 వేల ఏళ్ల క్రితం నాటివని శివనాగిరెడ్డి తెలిపారు. మూసీ నది సమీపంలో ఉన్న వీరభద్రాలయ ప్రాంగణంలోని రాతి పరుపుపై రాతి గొడ్డళ్లకు పదునుపెట్టడానికి ఉపయోగించిన దాదాపు 15 గాడులను (గ్రూవ్స్) పురావస్తు బృందం కనుగొంది. ఈ గాడులు కొత్త రాతి యుగం నాటివని గుర్తించారు. వీటి పొడవు 15 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు, లోతు 2 సెంటీమీటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఆనవాళ్లు ఆదిమానవుల జీవన విధానాన్ని సూచిస్తున్నాయని శివనాగిరెడ్డి తెలిపారు.