Share News

జాతీయ లోక్‌ అదాలత్‌లో 591 కేసుల పరిష్కారం

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:32 PM

కొల్లాపూర్‌ జూ నియర్‌ సివిల్‌ న్యాయాధికారుల కోర్టుల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించబడిన జాతీయ లోక్‌ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా, అపరాధ రుసుం విధించిన కేసు ల్లో మొత్తం 591 కేసులు పరిష్క రించారు.

జాతీయ లోక్‌ అదాలత్‌లో 591 కేసుల పరిష్కారం
కొల్లాపూర్‌ : జాతీయ లోక్‌ అదాలత్‌లో న్యాయాధికారులు

కొల్లాపూర్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : కొల్లాపూర్‌ జూ నియర్‌ సివిల్‌ న్యాయాధికారుల కోర్టుల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించబడిన జాతీయ లోక్‌ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా, అపరాధ రుసుం విధించిన కేసు ల్లో మొత్తం 591 కేసులు పరిష్క రించారు. 1వ బెంచీకి చైర్మన్‌ కం ప్రిసైడింగ్‌ న్యాయాధికారిగా దమ్ము ఉపనిషధ్వాని, మెం బర్లు న్యాయవాదులు కురుమూర్తి, మోహన్‌ లాల్‌ వ్యవహరించారు. ఈ బెంచీలో కొల్లాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు, కోడేరు పోలీస్‌ స్టేషన్‌కు సం బంధించిన సివిల్‌, క్రిమినల్‌ కేసులు ప్రధాన జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కోర్టు 1వ అ దనపు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కోర్టు, ద్వితీయ శ్రేణి కోర్టులకు బ్యాంకు ఫ్రీ లిటి గేషన్‌ కేసులు పరిష్కరించారు. 2వ బెంచీలో చైర్మన్‌గా శరణయ్య, మెంబర్‌గా శివారెడ్డి వ్యవహరించి 2వ అదనపు కోర్టుకు సంబంధించిన పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి పోలీసు స్టేషన్‌ కేసులు, సివిల్‌ కే సులు పరిష్కరించారు. ఈ లోక్‌ అదాలత్‌కు ఏపీపీలు జుబేదా, శిరీష, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగరాజు, న్యాయవాదులు, జేసీ కురుమయ్య, రాజేష్‌, రామలక్ష్మమ్మ,రాజు, రాఘ వేంద్ర, న్యాయ శాఖ సిబ్బంది లోక్‌ అదాలత్‌ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు, పారాలీగల్‌ వలం టీర్లు, బ్యాంకు అధికారులు హాజరయ్యారు.

Updated Date - Dec 21 , 2025 | 11:32 PM